బుడుగు : పిల్లల చదువు పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు.. !!
తల్లి తండ్రులు పిల్లల చదువు విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. స్కూల్ కి పంపిస్తున్నాము అక్కడ ఉపాధ్యాయులే చదివిస్తారులే అన్న ధోరణిలో తల్లితండ్రులు ఉండకూడదు. పిల్లల చదువు విషయంలో తల్లితండ్రులు కూడా బాధ్యత వహించాలి. ముందుగా పిల్లలను బాగా చదివించాలంటే.. ముందు వారికి చదువు పట్ల ఉన్న భయం అనేది పోగొట్టాలి.చదువు పట్ల ఇష్టాన్ని పెంచాలి.చదువుకుంటే సమాజంలో వచ్చే పేరు, ప్రతిష్టల గూర్చి పిల్లలకు వివరంగా చెప్పాలి.
పిల్లలకు ఏదైనా సబ్జెక్టులో ఆసక్తి లేకపోతే.. కారణాన్ని అడిగి తెలుసుకోండి. పాఠం అర్థం కాలేదా? లేక వినలేదా? అనే విషయాన్ని గ్రహించి పొరపాటును సరిదిద్దండి పిల్లలతో ఫ్రీగా ఉండండి.అంతేగాని కఠినంగా మాట్లాడి మార్కులు తక్కువ వస్తే కొట్టడం, తిట్టడం లాంటివి చేయకండి. ఏదన్నా ప్రశ్న పిల్లలు మిమ్మల్ని అడిగితే ఓపికగా సమాధానమివ్వండి.వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోండి. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ లో అయితే మార్కులు తక్కువ వస్తున్నాయో ఆ సబ్జెక్ట్ కి వేరే ట్యూషన్ పెట్టండి. అలాగే ఇంకొక ముఖ్య విషయం మీ పిల్లలను ఇతర విద్యార్థులతో పోల్చవద్దు.అలా చేస్తే వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి రాగానే కొంచెం సేపు అలా ఆటలు ఆడుకోనివ్వండి.
అంతేకాని ఇంటికి రావడం పుస్తకాలు తీసి చదువు అని వాళ్ళతో చెప్పకండి. పరీక్షల్లో పిల్లలు మంచి మార్కులు వస్తే వారికి పనికొచ్చే వస్తువును బహుమతిగా ఇస్తా అని చేప్పండి. దీంతో వారు మరింత బాగా చదవటానికి ఉత్సాహం చూపుతారు.అలాగే పిల్లలు ముందుగా బాగా చదవాలంటే సరయిన పోషక విలువులతో కూడిన ఆహారాన్ని పెట్టాలి.అలాగే ఎంత వీలయితే అంత టీవీ, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం మంచిది.పిల్లలకు ఒక్క చదువే ప్రపంచంలాగా కాకుండా అన్నిటి మీద ఆసక్తిని పెంచండి. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి టూర్ ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేయండి.