బుడుగు : ఒక పక్క కరోనా.. !! మరో పక్క వర్షాల నుంచి మీ పిల్లల్ని కాపాడుకోండి ఇలా.. !!

Suma Kallamadi
ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పేరు చెబితే చాలు వణికిపోతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని పట్టి పీడిస్తుంది.అయితే ఈ మహమ్మారి కరోనా వైరస్ విషయంలో చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.కరోనా వైరస్ అనేది శ్వాసకోశ వైరస్, ఇవి సాధారణ జలుబు నుండి మొదలయ్యి తీవ్ర శ్వాసకోశ సంబంధిత వ్యాధిగా రూపుదిద్దుకుని మనిషి ప్రాణాలను హరిస్తుంది అందుకనే ఎప్పుడుకప్పుడు పిల్లల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.పిల్లలు, వారి కుటుంబ సభ్యులు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రాకుండా సాధారణ నివారణ చర్యలలో పాల్గొనాలి.ఇంట్లో పిల్లలు ఉన్నపుడు పెద్దవాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.



దగ్గు వచ్చేటప్పుడు కర్చీఫ్ తో కవర్ చేసుకోవడం చేయాలి. అలాగే  సబ్బు, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌తో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీటితో పాటు ఇన్ఫ్లుఎంజాతో సహా టీకాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.అసలే ఇప్పుడు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి.అంటువ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే కాలం ఇది.అందుకే పిల్లల విషయంలో రక్షణ తప్పనిసరి. ఇతరులతో సన్నిహిత లేదా ప్రత్యక్ష సంబంధాన్ని నివారించండి.వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి. మీ చుట్టూ ఉన్న వస్తువులు మరియు ఉపరితలాలను క్రిమిసంహారకం చేయండి.గాలి ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి శస్త్రచికిత్సా ముసుగులు ధరించండి.బయటికి వెళ్ళేటప్పుడు ఎల్లపుడు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు.



అలాగే పిల్లల్ని మీతో పాటు బయటకు తీసుకుని వెళ్లడం మంచిది కాదు.కొన్ని రోజులపాటు బయట నుంచి తెచ్చిన ఆహారాన్ని పిల్లలకు పెట్టకపోవడం మంచిది.అన్నం తినేటపుడు మీ పిల్లల చేతులను శుభ్రంగా కడిగించండి. అలాగే కొన్ని రోజులు పాటు మాంసం తినకుండా ఉండటానికి ప్రయత్నించండి.కాచి చల్లార్చిన నీళ్లు పిల్లలతో తాగించడం మంచిది అలాగే సురక్షితమైన ఆహార నిర్వహణ పద్ధతులను అనుసరించండి.ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇంట్లో ఎవరికైనా వైరస్‌ సోకిన సమయంలో వారికి తెలియకపోవడంతో పిల్లలతో సన్నిహితంగా ఉండడం వల్ల చిన్నారుల్లో కరోనా లక్షణాలు ప్రవేశిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.అందుకని కరోనా లక్షణాలు మీలో కనిపిస్తే పిల్లలకు కొంచెం దూరం పాటించడం ఉత్తమం.పిల్లలకు వ్యాధినిరోధకత ఎక్కువగా ఉన్న ఆహారాన్ని పెట్టడం వల్ల కరోనా వైరస్ నుంచి మీ పిల్లల్ని మీరు కాపాడుకున్నట్లే.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: