బుడుగు: తల్లితండ్రుల ప్రవర్తన బట్టే పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారు.. !!
తల్లితండ్రులు కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి ఇంటికి వచ్చిన తర్వాత ఈ మొబైల్ అనేది చేస్తూ ఉంటారు.లేదంటే కాలక్షేపానికి ఉపయోగిస్తుంటారు. కానీ పిల్లలు ఇదే అదునుగా తీసుకుని అదే మొబైల్ కావాలని ఏడవడం మొదలుపెడతారు. వాళ్లకు మీరు ఇవ్వడం ఇదంతా మామూలైపోయింది అందుకోసమే ప్రతిసారి అలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. ఒక్కోసారి ఫోన్ అడిగిన వెంటనే ఇవ్వకపోతే కొంతమంది పిల్లలు ప్రమాదాలు సృష్టించవచ్చు.
అలాగే మరికొందరు పిల్లలు ఇవ్వకపోతే ఏదైనా చేయడానికి వెనకాడరు ఇంకా ఇంట్లో వస్తువులు పగలగొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకోసమే వాళ్ళని అదుపులో ఉంచడం అనేది మంచిది.అందుకనే తల్లిదండ్రులు అస్తమానం ఫోన్ చూడకుండా వంట చేయడం కానీ లేకపోతే ఏదైనా పని చేయడం కానీ చేస్తే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు.ఆఫీస్ నుంచి రాగానే కొంచెం సేపు పిల్లలతో సమయం గడపండి. వీలయితే మీరే బయటకు వెళ్లి పిల్లలతో ఆడుకోండి. నలుగురితో ఎలా ప్రవర్తించాలో వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పండి.. ఒక్కసారి ఫోన్ అలవాటు అయితే మానడం చాలా కష్టం... !!