బుడుగు : మీ పిల్లలు సరిగా అన్నం తినకపోతే ఇలా చేయండి... !!
పిల్లలకు రోజు ఒకేలా ఆహారం పెట్టకండి అలా పెట్టడం వల్ల తిండి మీద ధ్యాస తగ్గుతుంది. కాబట్టి ఆసక్తికరమైన వంటకాలు చేస్తూ ఉండాలి. నూనె ఎక్కువగా వాడిన ఆహరం అసలు పెట్టవద్దు. ఫ్యాట్స్ ఎక్కువగా శరీరంలో పడ్డాక, మరో పూట ఆకలి సరిగా వేయదు.పిల్లలకు ఆహారాన్ని అందించే సమయాన్ని క్రమబద్ధం చేసుకోండి. ఒక టైమ్ అనేది మీరు మీ పిల్లలకు ఆహారం తినిపించడానికి కేటాయించుకోండి.అంతేగాని ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టేయడం వల్ల వారికి అన్నం తినడం మీద ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది. అందుకే విసుగనుకోకుండా పిల్లలకు కొద్ది కొద్దిగా అన్నం తినేలా చూడండి.పిల్లలు సాయంత్రం సమయంలో కనీసం ఒక గంట ఆరుబయట ఆడుకునేలా చూడాలి. కుదిరితే మీతో పాటూ వ్యాయామానికీ తీసుకెళ్లాలి. దానివల్ల ఆకలిని పెంచే హార్మోన్లు సమతుల్యమవుతాయి. బాగా ఆకలీ వేస్తుంది.
చిరుతిండిని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు.అలా అని ఎంతసేపు చిరుతిండ్లు పెట్టకండి. అలాగే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్ తయారు చేయండి. రోజూ చేయాలంటే ఇబ్బంది కాబట్టి వారానికోసారి చేసి నిల్వ చేయండి.కొందమంది పిల్లలు బయటకి ఎక్కువగా వెళ్ళరు. ఇంట్లోనే టీవి, కంప్యుటర్, స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చుంటారు. ఇలాంటి పిల్లలకు క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావు కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా వేయదు. కాబట్టి పిల్లలు బయటకి వెళ్ళి ఆటలు ఆడకునేలా ప్రోత్సహించండి.