బుడుగు : పిల్లల ముందు తల్లితండ్రులు గొడవ పడితే??
ఇలా భార్య భర్తల మధ్య పిల్లలు నలిగి పోతున్నారు.నా భర్త నా మాటే వినాలి లేదా నా భార్య నేను చెప్పిన పనే చేయాలని ఆలోచించే వారిలో కచ్చితముగా గొడవలు వస్తాయి. ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటే ఆ ఇంట్లో ఉండే పిల్లలు ఎంతటి నరకయాతన అనుభవిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లలు అవ్వడంతో వారు అమ్మ నాన్న ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.కానీ పిల్లల ఎదుటే అమ్మ నాన్న పోట్లాడుకుంటే వాళ్ళ మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి.
ఎందుకంటే తెలిసి తెలియని వయసు, వారు అన్ని విషయాల్లో కూడా కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటారు. అందుకే పిల్లల ముందు గొడవలు పడకుండా ఒకరి లోపాలు ఒకరు సర్దుకుంటూ పోతే గొడవలు పడడానికి అవకాశం ఉండదు. చిన్నారుల ముందు భార్య భర్తలు పోట్లాటలు, గొడవలు పడకూడదు. అలా చేస్తే వారి సున్నితమైన మనసులు గాయపర్చడమేగాకుండా.. పెద్దయ్యాక వారు కూడా మీలాగే తయారయ్యే అవకాశాలు ఉంటాయి.అలాగే పిల్లలు ఉన్నపుడు భార్య భర్తలు అసభ్య పదజాలంతో తిట్టుకోకూడదు. ఇలా తిట్టుకోవడం వల్ల పిల్లలు కూడా ఆ మాటలు నేర్చుకుని పక్క వాళ్ళని తిడతారు.మీ పిల్లలు ఉన్నపుడు ఎట్టి పరిస్థితులలో కొట్టుకోవడం గాని తిట్టుకోవడం గాని అసలు చేయకూడదు.