బుడుగు: మీ పిల్లలు రోజు టిఫిన్ తినకపోతే ఏమవుతుందో తెలుసా.. !!

Suma Kallamadi
చాలా మంది పిల్లల తల్లితండ్రులు ఆఫీసులకు వెళ్లే హడావుడిలో పడి ఉదయం పూట పిల్లలకు అల్పాహారం పెట్టడం మానేస్తున్నారు.అలాగే ఉదయాన్నే లేచి టిఫిన్ చేయడానికి సమయం లేని తల్లులు వాళ్ళ పిల్లల్ని అలాగే కాలికడుపుతో స్కూల్ కి పంపించేస్తున్నారు. అంటే వారు ముందు రోజు రాత్రి నుండి మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నం వరకు అంటే 15 గంటల పాటు ఏమి తినకుండా ఉపవాసం ఉండటమే. ఈ పరిస్థితి ఇలాగే 2 నెలల పాటు కొనసాగితే అవసరమైన పోషకాలు లోపించి పిల్లలు రక్తహీనతకు గురవుతారు. ఈ ప్రభావం క్రమంగా వారి చదువుపట్ల కూడా పడుతుంది.


ఇలాగే జరిగితే చదువు పట్ల ఆసక్తి లేకపోవడానికి దారితీస్తుంది.మనకు రోజు వారి కావాల్సిన శక్తిని అందించేది ఆహారమే. సహజంగా తిన్న ఆహారం 4 గంటల్లోగా జీర్ణం అయిపోతుంది గనుక ప్రతి 4 గంటలకూ ఎదో ఒకటి తీసుకోవాలి. ఏ కారణం వల్ల అయినా మీ పిల్లలు 6 గంటల వరకు ఏమీ తీసుకోకపోతే వారి శరీరం శక్తి కోల్పోతుంది. దీనివల్ల రకరకాల సమస్యలు వస్తాయి.చిన్నవయసులోనే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.పిల్లలు మానసికంగా ఎదగాలంటే
అల్పాహారం ప్రాణం.ఆకలితో స్కూల్ కి వెళ్లే పిల్లలు చదువుపై కూడా ధ్యాస పెట్టలేరు. ఇది వారి ఆలోచనా సామర్థ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బాల్యం, టీనేజ్ లో వారి పెరుగుదల తగినట్లు ఉండాలంటే సరిపడ మోతాదులో తగినంత అల్పాహారం క్రమం తప్పక తీసుకోవాలి.


అప్పుడే వారి వయసుకు సరిపడా ఎత్తు, బరువు పెరుగుతాయి.పిల్లలకు ఉదయంపూట అల్పాహారం తప్పకుండా ఇవ్వాలి. ప్రతి రోజూ ఒకేలాంటి ఆహారం కాకుండా, ప్రతిరోజూ మీ పిల్లలు ఇష్టపడే విధంగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసి ఇవ్వటం మంచిది. ఇడ్లీ, దోశె, చపాతీ, పూరీ, ఉప్మా లాంటి వాటిని చట్నీలతో, కూరలతో కలిపి పెడితే పిల్లలు మరీ ఇష్టంగా తినడమే కాకుండా వారికీ కావాల్సిన పోషకాలు కూడా అంది పిల్లలు బలంగా ఉంటారు.. ఇంకోవిషయం పిల్లలకు ఏమి పెట్టకుండా స్కూల్ కి పంపితే నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంది జాగ్రత్త.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: