బుడుగు: మీ పిల్లల విషయంలో మీరు ఈలాంటి తప్పులు చేస్తే వాళ్ళని అదుపులో పెట్టడం కష్టం.. !!
పిల్లలను కూడా పట్టించుకోకుండా వాళ్ల ముందే సోషల్‌మీడియా, మెసేజింగ్, కాల్స్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ ధోరణితో పిల్లలు కూడా వాటికి అలవాటు పడే ప్రమాదం ఉంది. తమకు కూడా మొబైల్ కావాలని పట్టు బడతారు. తిండి, చదువు విషయంలోనూ గ్యాడ్జెట్స్ ఇస్తేనే చేస్తాం అన్న పంతం పెరిగిపోయి మొండిగా తయారవుతారు. ఇలాంటి ప్రవర్తన వాళ్ల చదువుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.అలాగే కొంతమంది తండ్రులు పిల్లల ముందే మందు తాగడం,సిగరెట్ కాల్చడం వంటివి చేస్తూ ఉంటారు.
అప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులకు తెలియకుండా వాటిని అలవాటు చేసుకుని అనారోగ్యాల బారిన పడుతుంటారు.పిల్లలు తెలిసో, తెలీకో ఏదైనా తప్పుచేస్తే తల్లిదండ్రులు వెంటనే దండించేస్తారు.గట్టిగా అరవడం, తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదు. చిన్న వయస్సులోనే వారిని దండించడం వల్ల మీపై వారిలో వ్యతిరేకత భావన కలగొచ్చు. మీ మాటను ఖాతరు చేయకుండా, ఏం చేసుకుంటావో చేసుకో అన్న ధోరణి పెరిగిపోతుంది.అందుకనే పిల్లల విషయంలో పై తప్పులు చేయకండి.. !!