బుడుగు : ఏ ఏ వయసులో పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో తెలుసుకోండి.. !!
అలాగే పిల్లలు పాకే వయస్సులో (8 నుంచి 10 నెలలు) ఉడికించిన క్యారెట్, బీట్రూట్, అరటి, ఆపిల్ ముక్కలు పెట్టాలి. మెత్తగా వండిన అన్నం లేదా కిచిడిని ఏదైనా కూరతో కలిపి పెట్టాలి. ఇంకా పాలల్లో నానబెట్టిన ఓట్స్ తినిపించవచ్చు.అలాగే పిల్లవాడు నిలబడే వయస్సులో(10-12 నెలలు) ఉడికించిన గుడ్డులోపలి పచ్చ సొన, ముక్కలుగా చేసిన కోడి గుడ్డు, మెత్తగా వండిన మాంసపు ముక్కలు పెట్టాలి మెత్తగా ఉండి నోట్లో వేసుకుంటే నానిపోయే చిరు తిండ్లు కూడా పెట్టవచ్చు.
అలాగే నడిచే వయస్సులో(12 నెలలు)తక్కువ పరిమాణంలో పెద్దవారు తీసుకునే ఆహారం పెట్టాలి. పరాటా, బ్రెడ్ టోస్ట్ మరమరాల ఉప్మా వంటి టిఫిన్లు పెడుతూ ఉండాలి. మాట్లాడే వయస్సులో(18 నెలలు)రకరకాల పరిమాణాలలో ఉండే తిను బండారాలు పెట్టాలి. పెరుగు,పన్నీరు, పాయసం, పాలు పండ్లతో చేసిన జ్యూస్లు, జీడి పప్పు,వేరు శెనగ పప్పు, బాదం పప్పుల గుజ్జు లేదా పొడులు.పరుగు నేర్చే వయస్సులో(24 నెలలు)అన్ని రకలా సమతుల్య ఆహారం పెట్టాలి..పైన పైన తెలిపిన విధంగా మీ పిల్లల వయసును బట్టి సరితూగే ఆహారాన్ని పిల్లలకు పెట్టండి.పిల్లలు కూడా పోషకాహార లోపం నుంచి బయట పడతారు. మంచి ఎదుగుదలతో పెరుగుతారు.