బుడుగు : మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలా మాత్రం తప్పక చేయండి.. !!
పిల్లలు సులభంగా కోపం తెచ్చుకుంటారు,భయపడతారు, ఏడుస్తారు ఇంకా వారికి ఏం అన్పిస్తుందో కూడా చెప్పలేరు. అందుకని చిరాకు తెచ్చుకోకండి. ఎప్పుడూ ప్రేమగా ఉండండి.పసిపిల్లలు ఏది అయినగాని వేగంగా నేర్చుకుంటారు.ఉదాహరణకు ఎలా నడవాలి, శబ్దాలు చేయటం, తినడం,తాగడం లాంటివి. అమ్మాయిలు,అబ్బాయిలు అందరూ ముఖ్యమే. అందర్నీ ఒకేలాగా, ముఖ్యంగా జబ్బు చేసిన పిల్లలను, వికలాంగులైన పిల్లలను ఒకేలాగా చక్కగా చూడండి.పిల్లలు తమ చుట్టూ ఉన్నవారిని అన్నిటిలో అనుకరిస్తారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి, వారి దగ్గర సరిగ్గా ప్రవర్తించి, వారికి మంచిమార్గాలు చూపించండి.పసిపిల్లలు ఏడ్చినప్పుడు తప్పక ఏదో ఒక కారణం ఉంటుంది (ఆకలి,భయం, నొప్పి).
అది ఎందుకో కనుక్కోండి.
.అంతేకాని వాళ్ళు అలాగే ఏడుస్తారు అనే నిర్లక్ష ధోరణి పనికిరాదు.పసిపిల్లలను అంకెలు, పదాల ఆటలు, పెయింటింగ్, బొమ్మలు వేయించటంలాంటివి ఆడించి వారిని బడికి సిద్ధం చేయండి. వారికి కథలు చెప్పండి, పాటలు పాడండి, డ్యాన్స్ చేయండి. ఒక నోటు పుస్తకంలో పాపాయి, పిల్లలుగా ఎలా ఎదుగుతున్నారో చూస్తూ అందులో రికార్డు చేయండి. వారు చేసిన ‘మొదటి’పనులు మాట్లాడటం, నడవటం వంటివి.పిల్లలు శుభ్రంగా ఉండేలా చేయండి(ముఖ్యంగా చేతులు,మొహాలు),సురక్షితమైన నీళ్ళు తాగేలా, సరిపోయేంత మంచి ఆహారం తినేలా చేసి వ్యాధులు రాకుండా అరికట్టండి.