బుడుగు: పుట్టిన పిల్లలకు తల్లి పాలు పట్టించడం అంతా అవసరమా..??
పాపాయికి మొదటి ఆరునెలల్లో అవసరమయ్యే పోషకాలన్నీ సరైన మోతాదులో బ్రెస్ట్ మిల్క్ నుంచి సంపూర్ణంగా అందుతాయి.అంతేకాదు బ్రెస్ట్ మిల్క్ లో యాంటీ బాడీస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి వైరస్ పై అలాగే బాక్టీరియాపై పోరాటం చేయగలుగుతాయి. మొట్టమొదట వచ్చే బ్రెస్ట్ మిల్క్ లో కోలాస్ట్రమ్ ఉంటుంది. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే, ఇందులో ఇతర యాంటీ బాడీస్ కూడా ఉంటాయి. వైరస్ లేదా బాక్టీరియాకు తల్లి ఎక్స్పోజైతే ఆమె శరీరంలో యాంటీబాడీస్ ప్రొడ్యూసవుతాయి. ఈ యాంటీబాడీస్ బ్రెస్ట్ మిల్క్ లో విడుదలవుతాయి. ఇవి శిశువుకు చేరతాయి. బేబీ ముక్కు, గొంతు అలాగే డైజెస్టివ్ సిస్టమ్ లో రక్షణ కవచం ఫార్మ్ అవుతుంది. సాధ్యమైనంత వరకూ తల్లి హైజీన్ ను పాటించాలి. శిశువును ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేయగలగాలి. ఫార్ములా మిల్క్ లో శిశువుకు యాంటీ బాడీ ప్రొటెక్షన్ లభించదు. బ్రెస్ట్ మిల్క్ కు నోచుకోని శిశువులలో న్యుమోనియా, డయేరియాతో పాటు ఇన్ఫెక్షన్స్ తలెత్తాయని అనేక స్టడీస్ వెల్లడించాయి.అంతేకాదు బ్రెస్ట్ మిల్క్ తాగే శిశువులు హెల్తీగా ఉంటారు. మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ నెలలు బ్రెస్ట్ ఫీడింగ్ అందిన శిశువుల్లో మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రిస్క్, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రిస్క్, జలుబు,అలర్జీలు, డయాబెటిస్, చైల్డ్ హుడ్ ల్యుకేమియా వంటి రిస్క్ లు తక్కువేనని స్టడీస్ వెల్లడించాయి.
అంతేకాదు, బ్రెస్ట్ ఫీడింగ్ అందించే ప్రొటెక్షన్ శిశువు పెద్దయ్యాక కూడా హెల్ప్ చేస్తుందట.బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వెయిట్ హెల్తీ లెవెల్స్ లో ఉంటుంది. పిల్లల్లో ఊబకాయం రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ అందిన బేబీస్ లో ఫార్ములా మిల్క్ తాగిన బేబీస్ తో పోల్చితే ఒబెసిటీ రిస్క్ 15 నుంచి 30 శాతం తక్కువని స్టడీస్ చెబుతున్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో మంచి గట్ బాక్టీరియా ఉంటుంది.అలాగే తల్లిపాలు తాగే శిశువులు హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్ కు అలవాటు పడతారు. ఆకలి తీరేవరకు మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారు. అతిగా తినే అలవాటు వారిలో ఎక్కువగా కనిపించదు.తల్లిపాలు తాగే శిశువుల్లో బ్రెయిన్ డెవెలప్మెంట్ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.