పిల్లలకి ఈ ఇంజెక్షన్స్ వేయిస్తే ఎలాంటి సమస్యలు రావట..!

N.ANJI
చిన్న పిల్లలున్న ఏ ఇంటిలోనైనా ఇమ్యునైజేషన్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఏ డాక్టరు వద్దకు వెళ్ళిన ఈ మాట పదే పదే వినిపిస్తుంది. ఇది మీ ఫ్యామిలీ సమయానుసారంగా వ్యాక్సినేట్ చేయించుకుంటే మీరు మీ కుటుంబంతో పాటు వ్యాధి వ్యాప్తిని అరికట్టగలుగుతారు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సీనేట్ ఐతే, అంత తక్కువ మంది ఇన్ఫెక్షన్‌కి గురవుతారు. దాంతో, వ్యాధి వ్యాప్తి తగ్గుతుంది. ఇమ్యునైజేషన్ అనేది ఒక విధమైన రక్షణ మీకు అలాగే మీ పిల్లలకు అందిస్తుంది. ఇక ఇమ్యునైజేషన్ అనేది జీవితాలను కాపాడుతుంది.
అయితే 1950లలో వేలాది మంది పిల్లలు ప్రతి సంవత్సరం టెటానస్, డిఫ్థేరియా అలాగే కోరింత దగ్గు వంటి వ్యాధులతో ఎక్కువగా చనిపోయేవారు. అదృష్టవశాత్తు, అటువంటి ప్రమాదం ఈ మధ్యకాలంలో చాలావరకు తగ్గింది. మేజర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ వల్ల ఈ సమస్య తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ వ్యాక్సినేషన్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి.
ఇది చిన్న పిల్లలో సంక్రమణ, ప్రేరేపిత వ్యాధులు, కారకాలను ఇమ్యునైజేషన్ గుర్తిస్తుంది. తరువాత శరీరానికి రక్షక వలయంగా పని చేస్తుంది. తిరిగి అలాంటి వ్యాధుల శరీరానికి సోకకుండా నిరోధిస్తుంది. పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి పిల్లలకు వాక్సిన్‌ను ఇప్పించాల్సిందే. వివిధ వ్యాధుల నివారణ, నియంత్రణ కోసం పిల్లలకు ఇమ్యునైజేషన్‌ను నిర్ణయించారు. కొన్ని వ్యాధులు కొంత వయస్సు దాటిన తరువాతనో, కొంత వయస్సు ముందరో వచ్చే అవకాశం ఉంది.
అయితే అంటువ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్స్ ఏ మేరకు పనిచేస్తాయన్న విషయంలో వ్యాక్సినేషన్స్ ను నిరంతరం పరీక్షిస్తూ ఉంటారు. వ్యాక్సినేషన్స్ నుంచి అందే సేఫ్టీ అలాగే ప్రభావం గురించి తెలుసుకుంటూ ఉంటారు. కొంతమంది వ్యాక్సీనేట్ చేయించుకోలేరు. వివిధ కారణాలు ఇందుకు దారితీస్తాయి. వారు అనారోగ్యంగా ఉండవచ్చు, లేదా వారు వ్యాక్సినేషన్ కు తగిన వయసులేనివారు కావచ్చు, కారణమేదైనా వారి కుటుంబంలోని ఇతరులు వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా వీరి ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చునని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: