బుడుగు: పిల్లల ఆకలి తీరిస్తే సరిపోదు..!
అయితే చిన్న వయసులో న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వకపోతే శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. ఎదుగుదల కూడా ఉండదు. పరిస్థితులను అర్థం చేసుకొనే కెపాసిటీ ఉండదు. రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ పవర్) తగ్గుతుంది. ‘విటమిన్, ఐరన్, క్యాల్షియం, అయోడిన్’ లాంటివి అందవు. దాంతో రోగ నిరోధకశక్తిపై ప్రభావం పడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే ఇబ్బందులు పడుతారు. ఫలితంగా చదువుపై ప్రభావం పడుతుంది. అనారోగ్యం వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోతారు. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ వీలైనంత వరకు తగ్గించాలి. ఒకే రకమైన ఆహారం ఇవ్వడం వల్ల కూడా సరిగా తినరు. లంచ్ బాక్స్లో పోషకాలు ఉండేలా మెనూ రెడీ చేయాలి.
పిల్లల్లో శారీరక ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లల పెరుగుదల కోసం కూడా సరైన ఫుడ్ ఇవ్వాలి. లేదంటే ఎదుగుదల అంతగా ఉండదు. చాలామంది పిల్లలకు సరైన ఆహారం అందక ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. కాబట్టి డాక్టర్లను సంప్రదించి, పెరుగుదల కోసం ఏయే ఆహారం ఇవ్వాలో తెలుసుకోవాలి.
చాలామంది పేరెంట్స్ ఉద్యోగాలు చేస్తుండటంతో పిల్లల డైట్పై ఫోకస్ చేయలేకపోతున్నారు. దానికితోడు గారాబం కూడా చేస్తుంటారు. ఇవన్నీ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. చాలామంది పిల్లలు మ్యాగీ, నూడిల్స్, సమోసాలు, బర్గర్లు తినడానికి ఇష్టం చూపుతారు. దాని వల్ల ఆకలి తీరుతుంది కానీ.. సరైన పోషకాలు అందవు. హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలొస్తాయి. కాబట్టి వీలైనంత వరకు పేరెంట్స్ ఇంట్లో తయారు చేసినవే ఇవ్వడానికి ప్రయత్నించాలి.