బుడుగు: పిల్ల‌ల్లో పెరుగుద‌ల క‌నిపించ‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!?

N.ANJI
పిల్లల పెరుగుదల విషయంలో పేరెంట్స్ చాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే పిల్లలు వయస్సుకు తగట్టు బరువు, ఉంటె చూడడానికి చాల మంచిగా అనిపిస్తుంది. అయితే కొంత మంది పిల్ల‌ల్లో వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగా పెరుగుద‌ల ఉండ‌కుండా పొట్టిగా ఉండిపోతారు. అలాగే, బ‌రువు కూడా పెర‌గ‌రు. కొన్ని సార్లు వంశ‌పారంప‌ర్యంగా కూడా శ‌రీర పెరుగుద‌ల‌లో మార్పులు వ‌స్తాయి. ఏదేమై‌ప్ప‌టికీ పిల్లల్లో శ‌రీర పెరుగుద‌ల స‌క్రమంగా ఉండాలంటే కొన్ని ర‌కాల ప‌నులు చేస్తే ఫ‌లిత‌ముంటుంద‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సాధార‌ణంగా పిల్లుల శ‌రీర పెరుగుద‌ల అనేది టీనేజీ వయస్సులో అధికంగా ఉంటుంది.  ఈ సమయంలో గనక శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే.. పెరుగుదల హార్మోన్ సరైన క్రమంలో విడుదల అవుతుంది. దీంతో పిల్లల్లో శరీర పెరుగుదల మెరుగైన స్థాయిలో ఉంటుంది.  ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు సైతం శ‌రీర పెరుగుద‌ల‌లో మంచి ఫ‌లితాల‌ను అందిస్తాయ‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో చూద్దామా.

అయితే ఉసిరికాయ‌లో అనేక ర‌కాలైప పోష‌కాలు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా సీ విట‌మిన్‌తో పాటు పాస్ఫ‌ర‌స్‌, కాల్షియం, మిన‌ర‌ల్స్ ఇందులో ఉంటాయి. అందువ‌ల్ల ఉసిరికాయ‌ల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల పోడ‌వు పెర‌గ‌టానికి ఉప‌యుక్తంగా ఉంటుంది. ఆయుర్వేద వైద్యుల సూచ‌న‌ల ప్ర‌కారం.. గుమ్మ‌డికాయ‌తో చేసిన ప‌దార్థాలు కూడా శ‌రీర పెరుగుద‌ల‌కు తొడ్ప‌డ‌తాయి. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తి రోజు టిఫిన్ తినే స‌మ‌యానికి ముందు ఉడ‌కబెట్టిన గుమ్మ‌డికాయా గోరువెచ్చ‌గా ఉన్న టైంలోనే దానికి తేనే, ప‌టిక బెల్లం పొడిని క‌లిపి నిత్యం కొద్దిగా తీసుకుంటే శ‌రీర పెరుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన టిష్యూలు మెరుగుప‌డ‌టంతో పాటు, కండ‌రాలు బ‌ల‌ప‌డ‌టాని ఉప‌యోగ‌ప‌డుతుంది.

అలాగే, కొద్దిగా అశ్వ‌గంధ పొడి, బెల్లం, ఐదు మిరియాలను గ్లాస్ పాల‌లో క‌లిపి రాత్రి పూట ప్ర‌తిరోజు తీసుకోవ‌డంవ‌ల్ల కూడా మంచి ఫ‌లితాలు వుంటాయి. అలాగే, ప్ర‌తిరోజు తాజా ఆకు కూర‌గాయాలు తీసుకోవ‌డం వ‌ల్ల కూడా శ‌రీర పెరుగుద‌ల మెరుగ‌వుతుంది. మ‌రీ ముఖ్యంగా బ‌చ్చ‌లికూర‌, గోంగూర‌, క్యారెట్‌, సోయాబిన్‌, బెండ‌కాయ‌లు వంటివి తీసుకోవ‌డం వ‌ల్ల పోడ‌వు పెరుగుతారు. ఎందుకంటే వీటిలో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఫైబ‌ర్‌, కాల్షియం, ఐర‌న్‌లు అధికంగా ఉంటాయి. అలాగే, నీరు కూడా అధికంగా తాగుతూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: