బుడుగు: చిన్నత‌నంలో పిల్లలు ఒత్తిడికి గురైతే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..!?

N.ANJI
నేటి యాంత్రిక జీవిన విధానంలో మానసిక ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. అలజడి, ఆందోళన, తదితర సమస్యలతో ప్రతివారి జీవితంలో ఓ భాగంగా మారాయి. ఇక బాల్యం ప్ర‌తిఒక్క‌రికీ తీపి గురుతుగా ఉండాలి త‌ప్ప బాధాక‌రంగా గ‌డ‌వ‌కూడ‌దు. చిన్న‌ప్ప‌టి జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకుంటే ముఖంలో చిరున‌వ్వు చిందించాలి. అలా ఉన్న‌వారి జీవితం అంతా ఆరోగ్య‌వంతంగా ఉంటారు. అంటే.. చిన్న‌పిల్ల‌లు ఒత్తిడికి గురైతే వారు పెరిగే కొద్ది దాని ప్ర‌భావం ఆరోగ్యం మీద ప‌డుతుంది. దీంతో గుండెపోటు, డ‌యాబెటిస్ వంటి వ్యాధుల బారిన ప‌డుతార‌ని అధ్య‌య‌నంలో తేలింది. అందుకే చిన్న‌పిల్ల‌ల‌ను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల మీద ఉంటుంది.
అయితే 7, 11, 16, 23, 33, 42 ఏండ్ల వ‌య‌సున్న 7 వేలమంది మీద ప‌రిశోధ‌న జ‌రిపారు. వీరిలో ఆందోళ‌న‌, ఒత్తిడి వంటి ల‌క్ష‌ణాల‌ను ప‌రిశోధ‌కులు సేక‌రించి అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత వెల్ల‌డించారు.  కాబ‌ట్టి పిల్ల‌ల భ‌విష్య‌త్తు బాగుండాలంటే వారు బాల్యంలో ఆనందంగా ఉండేలా  చూసుకోవాలి. లేదంటే 30 ఏండ్లు వ‌చ్చేస‌రికి గుండె స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.
ఇక అవకాశమున్న ప్రతిసారి మౌనంగా మనల్ని మౌనంగా ప్రశాంతతతో పరిశీలించుకోవటం మంచిది. మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ తప్పనిసరి చేయటం. దీనివలన ఒత్తిడి తగ్గే అవకాశమే కాదు ప్రశాంతతో మన సమస్యలకు మనమే సమాధానాలు కనుగొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్యాల కోసం ప్రతిరోజూ తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించటం. దీనివలన మెదడులోని రసాయనాల (న్యూరోట్రాన్సమీటర్స్) సమతూల్యత పెరుగుతుంది.
ఈ ఒత్తిళ్ల బాధితుల సంఖ్యా దిన దినాభివృద్దిగా పెరుగుతూనే వుంది. ప్రస్తుత మానవ సమాజంలో పిల్లల నుండి పెద్దల వరకు ఎవరూ మినహాయింపు కాదు. మరి ఈ ఒత్తిళ్ల వైకుంఠపాళి లో ఓటమి ఎరుగని ప్రయాణంకోసం మానసిక భరోసా కార్యక్రమాలు విద్యార్ధి దశనుండే నైతిక స్తైర్యం పెంచే పాఠ్యాంశాలు రావాలి. కుటుంబ వాతావరణాలలో కూడా ఖచ్చితమైన కొంత సమయం అందరూ కలిసి మెలిగే పరిస్థితులు పెరగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: