బుడుగు: పాలు తాగడం ఇష్టపడని పిల్లలు ఉంటే ఇది తాగించండి..!?
ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం వండడం వలన గంజి అంటే ఏమిటో నేటి పిల్లలకు తెలియదు. కానీ గంజి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఆ గంజిని పారబోయటం అనేది జరగదు. మళ్లీ పాత రోజుల్లో వండినట్లు అన్నం వండటం మొదలవుతుంది. గంజి లో అన్నం వేసుకుని, కొంచెం ఉప్పు వేసుకుని తింటే రుచిగా ఉండడం తో పాటు,శరీర ఉష్ణోగ్రతను అదుపుచేసుకోవచ్చు.
ఇక మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నం లో కలుపుకుని తింటే కడుపు నిండుగా ఉండడం తో పాటు శరీరాన్నికి చలవ చేస్తుంది.జ్వరం వచ్చినప్పుడు ఈ గంజిని తాగితే త్వరగా తగ్గుముఖం పడుతుంది. చర్మాన్ని గంజి సున్నితంగా, అందంగా మార్చడంతో పాటు,చర్మ వ్యాధులు రాకుండా రక్షణ కలిపిస్తుంది. జీర్ణక్రియను సక్రమం గా చేసిమలబద్ధకాన్నిపోగొడుతుంది గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం వలన శరీరం, మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
అంతేకాక నీరసంగా అనిపించినప్పుడు గంజిని తాగితే ఓపికవస్తుంది. గంజి లో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి . ముఖ్యంగా పసిపిల్లలు, ఎదిగే పిల్లలకు రోజూ గంజిని తాగడం అలవాటు చేయడం వల్ల వారికి సరైన పోషకాలు అందుతాయి. శరీర ఎదుగుదల కు బాగా ఉపయోగపడుతుంది. పాలు సరిగా తాగని పసి పిల్లలకు గంజి నీటినైనా తాగించవచ్చు. దీంతో కావాల్సిన శక్తి వారికి అంది పోషణ బాగా లభిస్తుంది. వేవిళ్లకు, విరేచనాలకు గంజిని మించిన దివ్యౌషధం లేదు . గంజి వార్చేలా అన్నం వండితే ,ఇంటిల్లిపాది గంజిని తాగితే ఆరోగ్యం మీసొంతం అవుతుంది.