బుడుగు: పిల్లలకు ఆ మందులు వాడేటప్పుడు తప్పకుండా ఇవి తెలుసుకోండి..!?

N.ANJI
చిన్నపిల్లలు కాస్త జబ్బున పడిన వెంటనే యాంటీ బాడీస్ మందులను వేస్తుంటారు. యాంటీబయాటిక్ మందులు  వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయనిఅందరికి తెలిసినదే. అప్పటికి మాత్రం వ్యాధులను తగ్గించడం కోసం చంటిపిల్లలకు  ఇచ్చే యాంటీబయోటిక్స్, అనేక రకాల అనారోగ్యాలకు హెల్త్ కేర్ కారణమవుతున్నాయని తాజాగా జరిగిన పరిశోధనలో తెలిసింది.
ఇక వైద్యుల ప్రిస్క్రిస్షన్‌ ద్వారా ఐదు కంటే ఎక్కువ సార్లు  మందులు వాడిన పిల్లల్లో ఈ ప్రమాదాలు మరింత ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పెన్సిలిన్ మందుకు అత్యంత సాధారణ యాంటీబయాటిక్‌గా పేరున్న కూడా ఈ పరిస్థితులన్నిటింతో సంబంధం ఉండటం ఆశ్చర్యాకరమైన విషయం . మరో యాంటీబయాటిక్ అయిన సెఫలోస్పోరిన్ ద్వారా ఆటిజం, ఫుడ్ అలర్జీ వంటి ప్రమాదకర అనారోగ్యా పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
అంతేకాక కడుపులో ఉండే సహజమైన గట్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్ మందుల వల్ల దెబ్బతినే అవకాశం ఉండొచ్చని లెబ్రాస్సేర్ బృందం తెలియచేసింది. సరైన రోగనిరోధక శక్తిని పెంచడానికి, అలాగే నాడీ వ్యవస్థ,మరియు శారీరక వృద్ధికి గట్ బ్యాక్టీరియా సహాయపడుతుంది. బ్యాక్టీరియాను చంపాలనే లక్ష్యంతో యాంటీబయాటిక్స్ మందులు పనిచేస్తాయి. ఈ విధంగా మనకు మేలు చేసే గట్ బ్యాక్టీరియా, అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియాకు మధ్య ఉన్న తేడాను అవి తెలుకోలేకపోవడంతో అసలు సమస్యకు కారణమవుతోంది.
ఇక గట్ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేయడానికి  శరీరం పోషకాలను గ్రహించే లా సహాయం చేస్తుంది. అయితే ఈ గట్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ మందుల ప్రభావానికి గురవుతుంది. ప్రధానంగా అప్పుడప్పుడే రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందే పిల్లల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. గట్ బ్యాక్టీరియా కెమోథెరపీ, బ్రెయిన్ కెమిస్ట్రీ ప్రతిస్పందనలతో సంబంధం ఉంటుంది. కానీ అనారోగ్యాలను తగ్గించాలంటే ఇలాంటి మందులు ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేయడం అసాధ్యం. పిల్లలకు ఇచ్చే యాంటీబయాటిక్స్ మోతాదులను పరిమితం చేయడం అనేది కష్టమైన విషయమని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఈ అధ్యయన ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు  చేయాలని తెలియచేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: