బుడుగు: మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. ఇలా చేయండి..!?

N.ANJI
చాల మంది పిల్లలలో వయస్సు పెరుగుతున్న ఎత్తు మాత్రం పెరగకుండా అలాగే ఉంటారు. పిల్లలు హైట్ పెరగాలని భావిస్తే.. కొన్ని టిప్స్ మీకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వడం వల్ల వాళ్లు సరైన ఎత్తు పెరుగుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక పాలు, వెన్న, మీగడ, పెరుగు ఇలాంటి డైరీ ప్రొడక్ట్స్ మీ పిల్లలు ఇష్టపడేలా, తినేలా జాగ్రత్త పడండి. రెగ్యులర్ గా వీటిని తినడం వల్ల ప్రొటీన్స్, క్యాల్షియం అందుతాయి. ఈ రెండు ఎముకలు, కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. దీంతో మీ పిల్లలు వేగంగా ఎత్తు పెరుగుతారు. కోడిగుడ్లలో కూడా ప్రొటీన్స్, విటమిన్ డి, విటమిన్ బి, రైబో ఫ్లోవిన్ ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల పెరుగుదల, గ్రోత్ కి సహాయపడతాయి.

పిల్లలకు కండరాలు, ఎముకల డెవలప్ మెంట్ కి ప్రొటీన్స్ చాలా అవసం. రెగ్యులర్ గా చికెన్ తినడం వల్ల పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది. ఎదిగే పిల్లలకు అరటిపండ్లు ఇవ్వడం వల్ల వాళ్లు న్యాచురల్ గా హైట్ పెరుగుతారు. అరటిపండ్లలో మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం ఉండటం వల్ల.. ఇది పిల్లలు వేగంగా హైట్ పెరగడానికి సహకరిస్తుంది. హైట్ పెరగడానికి ఓట్ మీల్ న్యాచురల్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రొటీన్స్ టిష్యూస్ వేగంగా పెరగడానికి సహాయపడుతాయి.

అయితే సోయా బీన్ లో పిల్లల ఎదుగుదలకు సహాయపడే పోషకాలు ఉంటాయి. ఫోలేట్, విటమిన్స్, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎముకలు, కండరాల ఎదుగుదలకు సహాయపడతాయి. పిల్లలు వాళ్లు పెరగాల్సిన ఎత్తు పెరగడానికి సహకరిస్తాయి. సాల్మన్, సార్డిన్, ట్యూనా వంటి చేపల్లో విటమిన్ డి, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల పెరుగుదలకు చాలా అవసరం. పిల్లలకు 5 నుంచి 6 ఏళ్ల వయసు రాగానే స్విమ్మింగ్ క్లాసెస్ లో జాయిన్ చేయించండి. పిల్లలు న్యాచురల్ గా హైట్ పెరగడానికి స్విమ్మింగ్ ఎక్సర్ సైజ్ సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: