బుడుగు: తమలపాకులోని ఔషధ గుణాలు.. పిల్లల ఆరోగ్యం...?
తాంబూలంలోని దినుసులు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు జర్దా వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కనుక తాంబూలం వేసుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం కాగా, తమలపాకులలో పలు ఔషధ గుణాలున్నాయి. ఇక పిల్లలకు వచ్చే జ్వరం నుంచి ఉపశమనం లభించాలంటే.. తమలపాకు రసంలో కస్తూరిని కలిపి పేస్ట్‌లా చేసుకుని తేనెతో కలిపి ఇవ్వడం చేస్తే జ్వరం తగ్గిపోతుంది. దగ్గు, జలుబును కూడా ఇది నయం చేస్తుంది. తమలాపాకును కాసింత వేడి చేసి అందులో ఐదు తులసీ ఆకులను ఉంచి నులిమి రసం తీసుకుని 10 నెలల పిల్లలకు 10 చుక్కలు రోజూ ఉదయం, సాయంత్రం ఇస్తే జలుబు, దగ్గు నయం అవుతుంది.
అయితే శొంఠి, మిరియాలును సమంగా తీసుకుని తమలపాకు రసంలో తేనే కలుపుకుని తీసిస్తే ఆస్తమా నయం అవుతుంది. అయితే తమలపాకును రుబ్బుకుని కీళ్లవాతం, మోకాళ్ల నొప్పులకు పూతలా వేసుకుంటే.. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకు రసం 15 మిల్లీ తీసుకుని వేడినీటిలో కలిపి తీసుకుంటే ఉబ్బసం, తలనొప్పి, కడుపునొప్పి నయం అవుతుంది. ఊపిరితిత్తులకు సంబంధిత రోగాలను నయం చేసుకోవాలంటే.. తమలపాకు రసం, అల్లం రసం సమానంగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పిల్లల్లో అజీర్తికి చెక్ పెట్టాలంటే తమలపాకుతో మిరియాలు చేర్చి కషాయం తీసుకుంటే సరిపోతుంది.
తమలపాకులు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతాయి. తమలపాకు రసంలో నీరు, పాలు చేర్చి రోజుకు ఒక కప్పు చొప్పున తీసుకుంటే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులను నయంచేయడంలో ఉపయోగపడతాయి. తమలపాకు రసంలో నీరు, పాలు చేర్చి రోజుకు ఒక కప్పు చొప్పున తీసుకుంటే మూత్రపిండాలకు చెందిన వ్యాధులు దూరమవుతాయి.