బుడుగు: పిల్లలతో ఈ ఆట ఆడిస్తే చెత్త తిండి మానేసి.. హెల్దీ ఫుడ్ తింటారు తెలుసా..!?

N.ANJI
పిల్లలు ఏడుస్తున్న ప్రతిసారి షాప్స్ ఎదోఒక్కటి కొనిస్తూనే ఉంటారు. ఇక పిల్లలు ఈవిధంగా వారికీ తెలియకుండానే జంక్ ఫుడ్ కి అలవాటు పడుతారు. చాలామంది పిల్లల్లో ఊబకాయానికి కారణం అనారోగ్యకరమైన ప్రాసెస్డ్ ఫుడ్ తినడమే కారణం అని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలోనే పిల్లలు జంక్ ఫుడ్ ని వదిలి ఆరోగ్యకరమైన ఆహారం పట్ల ఆకర్షితులు అయ్యేలా ప్రయత్నిస్తోంది ఓ యాప్. మొబైల్ గేమ్ యాప్ గా కనిపించే ఇది పిల్లలకు గేమ్ ద్వారానే అనారోగ్యకరమైన ఆహారాన్ని వదిలిపెట్టేలా ప్రోత్సహిస్తుంది.
ఈ కంపెనీ తమ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీస్ ని శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసింది. ఈ యాప్ ని తయారుచేసిన తర్వాత 104 మంది పిల్లలపై చేసిన సర్వేలో భాగంగా ఇది పది నుంచి పదకొండు సంవత్సరాల పిల్లల్లో జంక్ ఫుడ్ పై ఇష్టాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారం, లైఫ్ స్టైల్ ని ఇష్టపడేలా చేస్తోందని గుర్తించారు. న్యూట్రిషన్ కి న్యూరో సైన్స్ అప్రోచ్ ని జత చేర్చి ఈ యాప్ ని తయారుచేసినందువల్ల ఈ గేమ్ ఆడిన తర్వాత పిల్లలకు ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఇష్టం తగ్గిపోతుందట.
ఇక పిల్లలకు బోర్ కొట్టకుండా ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి ఈ యాప్ వివరిస్తోంది. ఈ ఆట ప్రారంభించగానే ఓ అవతార్ ని ఎంచుకోవాలి. ఆ అవతార్ ద్వారా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనే రోబోలతో వాళ్లు పోరాటం చేయాలి. వాటిని చంపుతూ ముందుకు వెళ్లాలి. అలాగే గుడ్ బాడీ షాప్ ద్వారా మంచి అలవాట్లకు గాను కాయిన్లు గెలుచుకుంటూ లెవల్స్ అన్ లాక్ చేసుకుంటూ ముందుకు వెళ్లే వీలుంటుంది. ఈ గేమ్ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ మంచి అలవాట్లు కొనసాగిస్తే ముందుకు వెళ్లడం సులభం అని సూచిస్తుంది. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం వల్ల లెవల్ మారే అవకాశం ఉండదు కాబట్టి ఫ్యాటీ ఫుడ్ మంచిది కాదని కూడా ఈ గేమ్ చెబుతుంది.
అయితే ఈ గేమ్ తయారీకి ముందు జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీ కి వెళ్లి పిల్లల ఆరోగ్యంపై మంచి సక్సెస్ సాధించిన వారి సర్వేలన్నింటినీ అధ్యయనం చేశానని.. దీనివల్ల తనకు వారి మనస్తత్వం గురించి మరింత తెలిసిందని చెప్పారు శ్రీ ప్రకాశ్. జెఎంఐఆర్ ఎంహెల్త్, యుహెల్త్ జర్నల్స్ లోనూ ప్రచురితమైన ఈ అధ్యయనాలు కేవలం 20 నిమిషాల పాటు ఒక ఆరోగ్యకరమైన అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది పిల్లల లైఫ్ స్టైల్లో పూర్తిగా మార్పులు తీసుకొస్తుందని.. ఆరోగ్యం దిశగా వారు ఆసక్తి చూపుతారని ఈ సర్వేల్లో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: