ఆవులు – సింహం

Durga
 ఒక అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలసి, ఒకే దగ్గర మేత మేస్తూవుండేవి. ఎక్కడికి వెళ్లాలన్నా అవి నాలుగు కలిసి కట్టుగా వెళ్లేవి. ఆనందంగా జీవించేవి. ఒకనాడు ఒక సింహం ఆ దారినపోతూ ఆవులను చూసి ‘‘ నాకు మంచి విందు భోజనం దొరికిందని’’ అనుకుంటూ. మేస్తున్న ఆవుల వద్దకు గాండ్రీంచుకుంటూ వచ్చింది. సింహం రావడం గమనించిన ఆవులు భయపడక నాలుగు ఆవులు కలసి తమ వాడి కొమ్ములతో సింహం వైపు దూకినాయి. నాలుగు ఆవులు కలసి కట్టుగా సింహంపై పడగానే సింహం భయపడి పారిపోయింది. కొంతకాలం తర్వాత తమలో తాము పోట్లాడుకొని, విడిపోయి వేరువేరు ప్రాంతాలలో మేత మేయ సాగినవి. ఈ విషయం తెలుసుకున్న సింహం ఒక్కొక్క ఆవును వరుసగా విడివిడిగా చంపితిన్నది  ఈ కథ లోని నీతి : అందరు కలసి జీవించడంలో ప్రమాదాలకు తావులేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: