మంత్ర పుష్పం

Durga
 దుర్వానుడు మహాముని ఆశ్రమంలో నాగవర్ధనుడు అనే శిష్యడుండేవాడు నాగవర్థనుడు కపటి. తన దురువు వద్ద ఎలాగైనా విద్యలన్నీ తక్కువ కాలంలో నేర్చుకుని, వాటి ఫలితాలను అనుభవించాలని యోచించేవాడు. ఒకసారి దుర్వాసన మహాముని ఏకాంతంలో ఉండగా నాగవర్థనుడు ముని కాళ్ళు వత్తుతూ స్వామీ మీకు చాలాకాలంనుంచి భక్తి శ్రద్దలతో సేవలు చేస్తున్నాను. అన్నాడు. దుర్వానుడు అతడి మాటలు విని నవ్వి ఊరుకున్నాడు. స్వామీ మీ ధయవల్ల అన్ని విధ్యలు నేర్చుకున్నాను. కాని, ఒక్క మంత్రపుష్పం విద్యనే నేర్చుకోలేకపోయాను కనుక దానిని నేర్పించి పుణ్యం కట్టుకోండి అంటూ ప్రాదేయపడ్డాడు. నాగవర్ధనుడి కపట స్వభావం తెలియని దుర్వానుడు మంత్రపుష్పంతో శిల అయిపోయే మంత్రాన్ని చెప్పడమే తరువాయి దానిని వెంటనే నాగవర్ధనుడు మంత్రాన్ని దుర్వానుడు మహాముని మీదే ప్రయోగించాడు. అయితే ఈ సంఘటనకు విస్తుపోయిన దుర్వానుడు నాగవర్ధనుడి ప్రవర్తనకు ఆగ్రహిస్తూ మూర్ఖుడా జ్ఞానాన్నిచ్చే గురువునే మోసం చేయాలని చూస్తావా ? నీకు మంత్రాన్ని చెప్పాను గాని, ఆ మంత్రం ఫలించడానికి ఫఠించాల్సిన మూలమంత్రాన్ని చెప్పలేదు. నీ కుటిల బుద్ది ఇప్పడర్థమైంది. నీ పాపానికి పరిహారంగా శిలవై పో అంటూ శపించి అక్కడినుంచి వెళ్ళిపోయాడు దుర్వానుడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: