బుడుగు: పిల్లలకు ఆస్త్మా రావడం వెనుక అసలు కారణం ఏంటో తెలుసా..!?
ఇక నిజానికి పొగత్రాగడం అనేది పురుషులకు మాత్రమే కాదు వారి పిల్లలకు కూడా ప్రమాదమే అని తెలుసుకోవాలి. మగవారు పొగత్రాగడం వల్ల పిల్లలను ఆస్త్మా వచ్చే అవకాశాలు మూడు రేట్లు ఎక్కువ అని ఒక పరిశోధనలో తేలింది. పరిశోధకులు 24 వేల మందికి పైగా పిల్లలు , పొగత్రాగే అలవాటు ఉన్న వారి తండ్రుల వివరాలు లోతుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు. ప్రదానం గా 15 ఏళ్ళ వయస్సు కన్నా ముందు నుండే పొగత్రాగే అలవాటున్న మగవారికి పుట్టిన పిల్లలకు ఆస్త్మా వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపించిందని పరిశోధకులు తెలియచేసారు.
అయితే ఆడవారు అందునా గర్భం ధరించిన సమయంలో పొగ త్రాగినా కూడా పిల్లలకు ఆస్త్మా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు తెలియచేస్తున్నారు. అంతే కాదు గర్భం ధరించడానికి ముందు తల్లులు పొగ త్రాగినా కూడా పిల్లలపై ఆ ప్రభావం ఉంటుందని తేలింది. తండ్రులు పొగ త్రాగితే వారి వీర్య కణాల ద్వారా పిల్లల ఆరోగ్య మీద ప్రభావము చూపుతుందని తేలింది. పొగతాగడం అనేది పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపడంతో పాటు వారిలో జన్యుపరమైన నష్టాలు కూడా కలుగచేస్తుందని పరిశోధకులు తెలియచేస్తున్నారు.
కాబట్టి పొగతాగే అలవాటు కు వీలైనంత దూరం గాఉండండి.సరదాకి కూడా దానిని దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడడం చాల అవసరం. ఈ పరిశోధనలో తల్లిదండ్రులు చెప్పిన మరో విషయం ఏమిటంటే తాము సరదాకు చేసిన పని పిల్లల ఆస్త్మా తో బాధపడుతున్నప్పు అనుభవిస్తున్న నరకం చూస్తుంటే చాల భయంకరం గా అనిపించిందని ఆవేదన చెందారట