బుడుగు: పిల్లలు సంతోషంగా ఉండాలి అంటే.. ఇలా చేయండి..!

N.ANJI
పిల్లల ఎదుగుల మొత్తం తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది.  మీ పిల్లల విషయంలో ప్రతి తల్లిదండ్రికి అవగాహనా తప్పనిసరిగా ఉండాలి. అయితే పిల్లలకు  4 ఏళ్ళ దగ్గరనుండి చిన్న చిన్న పనులు నేర్పండి.. వయసు పెరిగే కొద్దీ వాటిని పెంచండి. వారి సాక్స్ ఉతుక్కోవడం దగ్గర నుండి బ్యాగ్ సర్దుకోవడం వాటర్ బాటిల్ పట్టడం,వారు ఆదుకున్న తర్వాత టాయ్స్ వారే సర్ది పక్కన పెట్టుకోవడం. వారి బట్టలు మడత పెట్టుకోవడం, వారు తిన్న ప్లేట్ వారే క్లీన్ చేయడం,ఇంటికి ఎవరైనా వస్తే మంచి నీళ్లు ఇవ్వడం, మీకు ఇంటికి కావలిసిన సరుకులు తేవడం, పళ్ళు కూరగాయలు కొనుక్కు రావడం, బ్యాంక్ కి వెళ్ళి రావడం వంటలో సహాయపడడం వంటివి చేయాలి.

అంతేకాక ఇల్లు నీట్ గా సర్దడం, బట్టలు ఉతుక్కోవడం, ఐరన్ చేసుకోవడం, గిన్నెలు తోమడం, కూరలు తరగడం , చిన్న చిన్న వంటలు దగ్గర్నుండి మొదలు పెట్టి కూరలు చేసే వరకు నేర్పడం, ఇంటిలో ఎవరికైనా ఆరోగ్యం బాగోక పొతే జాగ్రత్తగా చూసుకోవడం, మీరే దగ్గర ఉంది ట్రాఫిక్ సిగ్నెల్స్ గురించి రూల్స్ గురించి వివరించడం,కొన్ని లా పాయింట్స్ నేర్పడం, ఇతరులకు సహాయ పడటం ఇలాంటివి ప్రతి ఒక్కరు పిల్లలకు నేర్పవలిసిందే. చదువు తో పాటు కచ్చితం గా పిల్లలకు ఇవి నేర్పినప్పుడు వారు చాల సౌకర్యం గా బ్రతకగలుతుతారు.

ఇక మా పిల్లకు ఇవ్వన్నీ అవసరం లేదు మాకు బాగా డబ్బుంది పనివాళ్ళతో చేయిన్చుకుంటారు లేదా మా పిల్లలు విదేశాలు వెళ్తారు అంటారా??అలా అయినా కూడా అన్ని నేర్పవలిసిందే. ఎందుకంటే విదేశాలలో ఎవరి పని వారే చేసుకోవాలి కాబట్టి పని నేర్చుకుని ఉంటే వారికీ జీవితం సుఖం గా గడుస్తుంది. ఇక పనివాళ్ళతో పని చేయిన్చుకోవాలన్న కూడా అసలు పని వచ్చి ఉంటేకదా వాళ్ళతో చేయించుకుంటూ చేస్తున్నారో లేదో గమనించుకునేది… కాబట్టి ప్రతి తల్లిదండ్రులు పిల్లల వయసును బట్టి వారికీ నేర్పించావలిసిన పనులు తప్పకుండా నేర్పండి వారి జీవితం సుఖవంతం  చేయండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: