బుడుగు: పిల్లలకు ఇలాంటి మాస్కులు వాడితే ప్రమాదం..!
అయితే పిల్లలకు రెడీమేట్ మెడికల్ మాస్క్‌లు వాడడం బదులుగా ఇంట్లో తయారుచేసిన మాస్క్‌లు, ఫేస్ కవర్లు వాడడం మంచిది. మాస్క్‌పెట్టినప్పుడు పిల్లలు అసౌకర్యానికి లోనవుతుంటే, వారి ముక్కు నోరు కప్పేలా చేతి రుమాలు కట్టడం మంచిది … అయితే అది పిల్లలు తీసేయకుండా ఊడిపోకుండా సందులు కూడా లేకుండా ముక్కు నోటిని పూర్తి మూసేలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మాస్క్ పెట్టుకోవడమన్నది మన జీవితంలో ఓ భాగమైపోయిందని చెప్పాలి.
ఇక స్కూలుకెళ్లే పిల్లలు రోజూ తప్పనిసరిగా మాస్క్ పెట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.. తరగతి గదిలో, ఇతర పిల్లలతో మాట్లాడేటప్పుడు మాస్క్ తీయకుండా మాట్లాడాలని వారికి చెప్పాలి. అలాగే మాస్క్ ని ఎలా ధరించాలి, ధరించినప్పుడు తాకకుండా ఉండడం, తొలగించడం.. వంటివి కూడా తప్పనిసరిగా వారితో ప్రాక్టీస్ చేయించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు.. రీ యూజబుల్ మాస్క్ వాడితే వాటిని వేడి నీళ్లలో ఉతకడం, వాడి పడేసే దైతే మూత ఉన్న చెత్త డబ్బాలో మాత్రం పడేయాలన్న విషయం గురించి కూడా పిల్లలకు వివరంగా చెప్పాలి. ఇక మధ్యాహ్నం భోజన సమయంలో చాలామంది పిల్లలు తాము తీసుకు వెళ్లిన పదార్థాలు తమ స్నేహితులతో షేర్ చేసుకుంటూ సరదాగా భోం చేస్తుంటారు. అయితే కొవిడ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి అలవాటు మంచిది కాదని పిల్లలకు వివరంగా చెప్పాలి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా దూరం దూరంగా కూర్చుని తినమని వాళ్ళకి చెప్పాలి.