బుడుగు: మీ పిల్లలు ఫోన్ లో ఏమి చూస్తున్నారో గమనిస్తున్నారా..!

N.ANJI
నేటి సమాజంలో పిల్లలు ఫోన్ చాల అలవాటు పడ్డారు. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా.. ఆన్ లైన్ శృంగారం చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, హౌస్ వైఫ్ లను టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియాలో సెక్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బయటపడింది. దీని కోసం ఇన్ స్టాగ్రామ్ ని ఎంచుకున్నారు. దీనిలో ఎక్కువ సమయం గడిపే అమ్మాయిలు, హౌస్ వైఫ్ లను టార్గెట్ చేసుకుంటున్నారు. శృంగార పరమైన చాట్ లో వారు భాగస్వామి అయితే.. డబ్బులు ఇస్తామని.. ఇంట్లో ఉండే డబ్బులు బాగా డబ్బు సంపాదించి కోవచ్చని ఆశపెడుతున్నారు.
డబ్బు అవసరం కోసం వాళ్లు కూడా ఈ నేరంలో భాగమౌతున్నారు. శృంగార సంబంధం అయినా చాట్ లో పాల్గొనాలని ఎవరైనా అనుకుంటే.. వారికి  అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ ఐడీ తో పాటు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నారు. ఆ ఐడి లోకి వెళ్లి వీడియో కాల్ చేస్తే… అమ్మాయిలు నగ్నంగా కనిపిస్తారు. ఇందు కోసం రూ.550  చెల్లిస్తే సరిపోతుందని తెలియచేస్తున్నారు.
ఇక డబ్బులు చెల్లించిన వారికి అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ ఐడీలు ఇస్తున్నారు…. గతంలోనూ ఈ రకం సెక్స్ వ్యాపారాలు జరిగినప్పటికీ  ఈ కరోనా కాలంలో మరింత పెరిగిపోయాయి. అయితే దీనిలో మైనర్ బాలురు కూడా పాల్గొనడం ఆందోళన కలిగించే విషయంగా ఉంది. చిన్నారులకు  ఇలాంటి వీడియోలు చూడటం అలవాటు అయితే మాత్రం పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే వీటి వలన పిల్లల్లో మానసిక సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలపై పోలీసులు పెద్దగా  శ్రద్ధ చూపించడం లేదనే వాదనలు కూడా లేకపోలేదు. ఇలాంటి వాటిని కూడా వ్యభిచార దందా గా భావించి చర్యలు తీసుకోవాలని పలువురు వేడుకుంటున్నారు. ఈ తరహా వ్యవహారం కేరళ రాష్ట్రంలో  మరింతగా పెరిగిపోయానని స్థానికులు తెలియచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: