బుడుగు: పిల్లల కోసం పోషకాల పొడి ఇదే..?
అయితే రక్తహీనత తగ్గడంతో పాటు ఈ ఆహారం తీసుకున్న చిన్నారుల్లో తెలివితేటలు(ఐక్యూ) 6 పాయింట్లు పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడించారు. అలాగే సామాజిక-భావోద్వేగపరమైన ఎదుగుదల 4.5 పాయింట్ల మేర పెరిగినట్లు తెలిపారు. అలాగే బెరుకుదనం 3 పాయింట్ల మేర అదుపులో ఉందని ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక బహుళ సూక్ష్మపోషకాలు ఉన్న ఆహారం తీసుకున్న చిన్నారుల్లో గణనీయమైన మార్పు కనిపించిందని అన్నారు. ఇక వారు చాలా చురుగ్గా మారారని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆరోగ్యంతో పాటు ప్రవర్తనలో కూడా మార్పు కనిపించిందన్నారు. ఇక మెరుగైన రీతిలో ప్రాథమిక విద్య నేర్చుకునే సంసిద్ధత వారిలో కనిపించినట్లు తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా అంగన్‌వాడీల నుంచి ప్రాథమిక పాఠశాలల్లో చేరే 3-6 ఏళ్ల చిన్నారులు 2.5 కోట్ల మందికి పైగా ఉన్నారని తెలిపారు. అయితే వారందరికీ తక్కువ ఖర్చుతో ఆరోగ్యం, చురుకుదనంతో పాటు సంపూర్ణమైన ఎదుగుదలను అందించేందుకు బహుళ సూక్ష్మపోషకాలతో కూడిన ఆహారం ఎంతో ఉపయోగపడుతుంది’ అని సిల్వియా పేర్కొన్నారు. అంతేకాదు.. కెనడాకు చెందిన మైక్రోన్యూట్రియంట్ ఇనీషియేటివ్, అమెరికాకు చెందిన మాథిలే ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ది అడాన్స్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ సంస్థల ఆర్థిక సౌజన్యంతో చేపట్టిన ఈ పరిశోధన ఫలితాలను అంతర్జాతీయంగా పేరుపొందిన న్యూట్రిషన్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించిందని అన్నారు.