బుడుగు: చిన్న పిల్లల్లోనూ షుగర్ వ్యాధి.. గుర్తించేదెలా..?

N.ANJI
మన దేశంలో డయాబెటీస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య అంతకంతా విస్తరిస్తోంది. మన దురదృష్టం కొద్దీ చిన్నారులకి కూడా ఇది పాకుతోంది. చిన్నవారిలో ఈ సమస్య రాదనే భావనతో మనం దాన్ని గుర్తించట్లేదు. లేటుగా ఈ సమస్యను చిన్నారుల్లో గుర్తించటం వారి పాలిటశాపంగా మారింది.. అయితే కొన్ని లక్షణాలతో దీన్ని ఈజీగా గుర్తుపట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు అవేంటో తెలుసుకుందాం..
డయాబెటీస్ ముఖ్య లక్షణం బరువు తగ్గడం. ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు ఉన్నట్టుండి బరువు తగ్గితే తప్పక ఆలోచించాల్సిందే. షుగర్ వ్యాధి ఉంటే ఎక్కువగా దాహం వేస్తుంటుంది. కాబట్టి పిల్లలు నీరు ఎక్కువగా తాగుతుంటారు. ఇలా తాగుతుంటే అనుమానించాల్సిందే. అతిగా మూత్ర విసర్జన చేస్తుంటారు. చిన్నారుల్లో కొన్ని స్పర్శ ఉండదు.. ముఖ్యంగా వారి కాళ్లు, చేతులకి ఎలాంటి దెబ్బలు తాకినా ఎలాంటి స్పర్శ ఉండదు. ఇది ఘగర్ వ్యాధికి సంకేతమే..ముందుగా గుర్తించకపోతే వ్యాధి ముదిరి ఇబ్బందిగా మారుతుంది.  కడుపు నొప్పి అంటూ ఇబ్బంది పడతారు. మధుమేహానికి మరో చిహ్నం కళ్లు కనిపించకపోవడం.  
అయితే చిన్నారులు అందరికీ ఈ లక్షణాలన్నీ కనిపించాలనేం లేదు. కొంతమందికి ఇలాంటి లోపాలు ఏం లేకుండా కూడా సమస్య ఉంటుంది. దాన్ని మనం సకాలంలో గుర్తించకపోతే ఇబ్బందిగా మారుతుంది. తీరా ఈ వ్యాధి పిల్లలతో పాటే పెరుగుతుంది. సాధారణంగా పిల్లలకు టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో జన్యుపరమైన, పర్యావరణ లోపాలు కూడా కారణం కావొచ్చు. టైప్ 1 డయాబెటిస్ మెల్లిటిస్ దగ్గరి బంధువులలో ఎక్కువగా ఉంటుంది. దగ్గరి బంధువులకు ఎవరైనా ఉంటే ఈ వ్యాధి పిల్లలకు 0.4 శాతం పిల్లలకి వస్తుంది. ఇక అదే తల్లికి ఉంటే పిల్లలకు 1 నుంచి 4 శాతం వరకు వస్తుంది.  ఒక వేళ తండ్రికి ఉంటే వారి పిల్లలకు 3 నుంచి 8 శాతం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: