చిన్నారులను చిదిమేస్తున్న మాధ్యమాలు!

LAXMAN
టీవీలు, సెల్ ఫోన్స్ దైనందిన జీవితంలో  ప్రధాన ప్రాత పోషిస్తున్నాయి. టీవీల్లో చిన్నారులకు నచ్చని ఫ్రొగ్రాం వస్తున్నప్పుడు చానెల్ మార్చినా, చూడద్దు అని చెప్పిన ఆ సమయంలో వారు నుంచి వచ్చే రీయాక్షన్ మాములుగా ఉండదు. మోబైల్ అయితే ఇంక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా ఎలక్రానిక్ డివైజెస్ మనిషి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. దీనినే అదునుగా చేసుకుని ఎంటర్టైన్మెంట్ చానెల్స్ వారు రేటింగ్ కోసం, దానిపై వచ్చే యాడ్స్ కోసం చేసే ఫీట్స్ అన్నీఇన్నీ కావు. మహిళలను, ముఖ్యంగా చిన్నారుల కోసమే కొన్ని చానెల్స్ స్పేషల్ గా ప్రొగ్రామ్స్ డిజైన్ చేసి టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. 

ఎన్ని పనులన్నా వాటిని పక్కనపెట్టి మరి టీవీ చూసేందుకు అధిక ప్రాధన్యత ఇస్తున్నారు. ఏడుపుగొట్టి సీరియల్స్ ప్రసారం చేసే లోకల్ చానెల్స్ నుంచి కార్టూన్ కథనాలు ప్రసారం చేసే జపానీస్ చానెల్స్ వరుకు చేసేది ఒక్కటే మహిళలను, చిన్నారులను టీవీలకు కట్టిపడేలా చేయ్యడం, ఎడిట్ అయ్యేలా చూడటం. దీంతో విపరీతమైన టీఆర్పీ రేటింగ్ చూపించి, వాణిజ్య ప్రకటనలను దండుకోవడం ప్రస్తుత చానెల్స్ అవలంభిస్తున్న ట్రెండ్. వీరిపోకడలకు ఎంతమంది మహిళలు, చిన్నారులు వారికి నచ్చిన చానెల్స్ ను ఇంట్లో చూడనీవ్వడంలేదని మనస్తాపానికి గురై తనవు చాలిస్తున్నారు.

టీవీలో వచ్చే తమకిష్టమైన కార్యక్రమాన్ని చూడనివ్వలేదని అక్కడక్కడ కొందరు ఆత్మహత్య పాల్పడిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఈ తరహాలోనే కేరళలో ఒక విషాద సంఘటన పలువురిని కంటతడిపెట్టించింది. తన సోదరి తనకు నచ్చిన ప్రొగ్రాం ను చూడనీవ్వడంలేదని మనస్తాపానికి గురై కిటికీ గ్రిల్స్ కు ఊరిపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అభశుభం తెలియని పసి హృదయాల్లో టీవీలు, సెల్ ఫోన్స్ ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయో ఈ ఘటన కనులకట్టిన చూపుతుంది. కేరళ ఇడుక్కిలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు వెల్లడించిన కేస్ స్టడీలో వివరాలు ఇలా ఉన్నాయి.
కేరళలోని ఇడుక్కి మనక్కాడ్ లో సోమవారం మధ్యాహ్నం అమీనోర్ అనే బాలిక ( 11 ) తన ఇద్దరి సిస్టర్స్ తో కలిసి టీవీలో తనకు నచ్చిన చానెల్ పెట్టుకుని ప్రొగ్రాం చూస్తోంది. ఆ తరుణంలో తన అక్కతో గొడవ మొదలై, అదికాస్తా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆ సమయంలో వారిని వారించేందుకు తల్లిదండ్రులు కూడా ఇంట్లో అందుబాటులో లేరు. దీంతో అమీనోర్ ఇంకా మనస్తాపానికి గురైంది. దీంతో తనవు చాలించాలని భావించిందేమో కానీ తన అమ్మమ్మ చూసే సరికి గదిలోకి కిటికీ గ్రిల్స్ కు చున్నితో ఉరిపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా తనను ఓ గదిలో బంధించడంతో అమీనోర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సో టీవీలో ప్రొగ్రాం చూడనివ్వలేదని మొదలైన గొడవ .. చివరికి నిండుప్రాణాలను బలికొనే వరకు సాగి విషాద్దాంతమయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరౌతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: