బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!
ఇక పచ్చిగా ఉన్న ఆహార పదార్థాలను కాకుండా మలబద్దకంతో బాధపడే వారి ఉడకబెట్టిన ఆహార పదార్థాలను తినమని చెబుతున్నారు. అయితే ఇలా ఉడకబెట్టిన ఆహార పదార్థాలను తినడం వలన అవి సులభంగా జీర్ణమవుతాయని చెబుతున్నారు. కాగా.. చక్కెర వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు. అంతేకాక.. జంక్ ఫుడ్స్, ప్యాకెట్లలో నింపిన స్నాక్స్ తీసుకోవడం తగ్గించాలని చెబుతున్నారు. అయితే వీటికి బదులుగా వారికి తాజాగా వండిన భోజనాన్ని అందించాలని చెబుతున్నారు.
అయితే జంక్ ఫుడ్స్ వాడడం వలన మన పిల్లల్లో మలబద్దకం సమస్య ఏర్పడేందుకు చాలా ఆస్కారాలున్నాయని చెబుతున్నారు. అంతేకాక.. బయటి ఫుడ్ లను పిల్లలు తినకుండా చూసుకోవాలని తెలిపారు. ఇక జంక్ ఫుడ్ తినడం వలన మలబద్దకంతో పాటు ఊబకాయం సమస్య కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.
కాగా.. వీటితో పాటు చిన్నారులను ఎల్లప్పుడూ నడుస్తూ, పరుగెత్తుతూ ఉండే ఆటలు ఆడేలా ప్రోత్సహించాలని చెబుతున్నారు. ఇక ఇలా చేయడం వలన వారిలో జీవక్రియ మెరుగవుతుందని తెలిపారు. అంతేకాక.. ఇలా చాలా సింపుల్ చిట్కాలతో మలబద్దకం సమస్యకు ఇంటి వద్దే పరిష్కారం లభిస్తుందని అన్నారు. అయితే ముందు ఇలా చేసి చూసినా కూడా మలబద్దకం సమస్య తగ్గకపోతే అలాగే ఉంటూ తీవ్రంగా బాధిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించి మలబద్దకం నివారణకు మంచి మందులు వాడడం మంచిది అని అన్నారు.