బుడుగు: పిల్లలకు బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించాల్సింది మీరే..!!
అయితే సాధారణంగా పిల్లలకు ఏ విషయమైనా వారి చదువు లేదా జ్ఞానం ద్వారా తెలిసిపోతుందని తెలిపారు. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ మధ్య తేడాపై వారికి అవగాహన కల్పించడం తప్పనిసరి చెబుతున్నారు. అయితే ముఖ్యంగా బాడీలో ప్రైవేటు భాగాల గురించి వారికి చెప్పాలని తెలిపారు. అంతేకాక.. ఏదైనా బొమ్మలు లేదా ఇతర కార్టూన్స్ పాత్రల ద్వారా శరీరంలోని వివిధ భాగాలను పిల్లలకు అవగాహన కల్పించాలని చెబుతున్నారు.
ఇక పిల్లలు వారిపై జరుగుతున్న ఆకృత్యాం ఏమిటో తెలుసుకోలేరు కాబట్టి, ఎవరూ కూడా తమ ప్రైవేటు భాగాలను తాకనియవద్దని, మరొకరి పార్ట్‌లను వీరు తాకవద్దని చెబుతుండాలి. అంతేకాదు.. చాలా సందర్భాల్లో పిల్లలు తమ తల్లిదండ్రులతో ఏ విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండరు. అందుకు కారణం ఏంటంటే.. వారు ఏవైనా ఇబ్బందులు పడతారేమోనని భావిస్తుంటారు. ఇక ఈ భయం నేరస్థులకు పిల్లలపై దాడులు చేయడానికి మరింత ప్రొత్సాహం ఇస్తుందని అన్నారు.
అయితే ఏమి జరిగినా సరే.. మీ పిల్లలకు శరీర భద్రత లేదా శరీర ప్రైవేటు పార్టుకు ఏదైనా సమస్య వస్తే దాని గురించి ఎల్లప్పుడూ వారి తల్లిదండ్రులతో పంచుకోవాలని తెలిపార. ఇక అలా పంచుకోవడం తప్పు కాదని మీరు చెబుతుండాలి. అంతేకాక.. కొన్నిసార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఏవైనా సంఘటనలు పంచుకున్నపుడు వారిని తిడుతుంటారు. అయితే అలా చేయకుండా.. అది మంచిది కాదని చెప్పాలి. ఇక ఇది జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడికి లోనవుతారని చెబుతున్నారు.