బుడుగు: పిల్లలకు గంజి తాగించడం మంచిదేనా..??

N.ANJI
సాధారణంగా పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే పూర్వ కాలంలో అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని తాగుతూ ఉండేవారు. కానీ నేటి సమాజంలో అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని పారబోస్తున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. గంజి ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇక అసలు అన్నం కంటే గంజిలోనే ఎక్కువ పోషక విలువలు నిండి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజూ గంజి తాగితే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని అంటున్నారు. అయితే గంజి పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
అయితే ముఖ్యంగా పదేళ్లకు పైగా ఉండే పిల్లలకు ప్రతి రోజూ ఒక చిన్న కప్పుడు గంజి పట్టిస్తే.. వారి ఆరోగ్యంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయని అన్నారు. ఇక పిల్లలకు గంజిని పట్టిస్తే వచ్చే లాభాలు ఏంటో ఒక్కసారి చూద్దామా. అయితే పిల్లలకు ఒక చిన్న గ్లాస్ గంజిలో చిటికెడు నల్ల ఉప్పు కలిపి ఇవ్వడం మంచిదని అంటున్నారు. ఇక చిన్న బెల్లం ముక్క గంజిలో కలిపి ఇవ్వచ్చు అని చెబుతున్నారు. గంజి ఆరోగ్యానికి ఇవ్వడం మంచిదని అంటున్నారు.
ఇక సాధారణంగా పిల్లలు పెద్దగా వాటర్ తాగడానికి ఆసక్తి చూపించారు. అయితే  రోజూ ఒక కప్పు గంజిని పిల్లలకు తాగిస్తే.. వారిలో డీహైడ్రేషన్ సమస్య ఉండదని అంటున్నారు. అంతేకాదు.. గంజి ఒక హైడ్రేటింగ్ డ్రింక్ గా పనిచేస్తుందని అన్నారు. ఇక కొందరు పిల్లలు వయసు పెరుగుతున్నా బరువు మాత్రం పెరగరాని అన్నారు. అలాంటి పిల్లలకు రోజూ గంజిని తాగిస్తే చక్కగా బరువు పెరుగుతారని అన్నారు. అయితే పిల్లలకి  గంజి పట్టిస్తే.. ఎప్పుడూ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారని అన్నారు. గంజి తాగించడం వలన పిల్లలలో నీరసం, అలసట వంటి సమస్యలూ, సీజనల్ వ్యాధులూ వారి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: