బుడుగు: పిల్లలలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే అది డెంగీనే..!!
అయితే ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సీజనల్ సమయంలో టైగర్ దోమల వల్ల డెంగీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. అంతేకాక.. ఈ దోమల ప్రభావం రాత్రి పగలు అధికంగా ఉంటుంది. కనుక పిల్లలను దోమల నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుందని అన్నారు. అలాగే డెంగీ జ్వరాన్ని ముందుగా గ్రహించి సరైన చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునని అన్నారు.
చిన్న పిల్లలో డెంగీ జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా నొప్పులు, అధిక జ్వరం, వాంతులు అవడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. పిల్లలో ఈ లక్షణాలు కనబడితే వెంటనే వారికీ రక్తపరీక్షలు చేయించి నిర్ధారణ చేసుకోవాలని చెబుతున్నారు. ఇక వీలైనంత వరకు మన ఇంటిలోనూ, ఇంటి పరిసరాలలో నీరు నిలువకుండా చూసుకోవడం చాలా మంచిది. దోమల నివారణను అరికట్టడం వలన విష జ్వరాల నుంచి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా డెంగీ జ్వరం వచ్చినప్పుడు శరీరం మొత్తం నొప్పులు రావడంతో ఈ జ్వరాన్ని బోన్ బ్రేక్ ఫీవర్ అని కూడా పిలుస్తారని అన్నారు. అందుకే పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.