బుడుగు: పిల్లలకు నిద్రపట్టకపోవడానికి కారణాలివే..!!
సాధారణంగా పిల్లలకు నిద్ర తక్కువైనప్పుడు కొన్ని సంకేతాలను గుర్తించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక పిల్లలు సరిగా ప్రవర్తించనప్పుడు, ఓవర్ యాక్టివ్గా ఉన్నప్పుడు, చదువులో వెనుకబడి ఉన్నప్పుడు, శారీరకంగా ఎక్కువగా ఎదగనప్పుడు వారికి సరైన నిద్ర ఉందా లేదా అనేది పెద్దలు తప్పకుండా గుర్తించాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు నిద్ర తక్కువైనా విషయాన్ని గుర్తించలేరు కాబట్టి చిన్నారుల నిద్ర విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. పిల్లలు త్వరగా నిద్రలోకి జారుకోలేరు. వాళ్ళు మధ్యమధ్యలో లేస్తూ కదులుతూ ఉంటారు. ఇక తెల్లవారుజాముల్లోనే మేల్కొంటారు. ఇక ప్రధాన కారణం ఏంటంటే.. తరచూ ఇళ్లు మారడం, ఇంట్లో గొడవలు జరుగుతుండడం, స్కూళ్లకు వెళ్లే తొలినాళ్లలో ఇబ్బందులు.. వంటి కారణాల వల్ల పిల్లలు సరిగా పడుకోలేరు. ఇక పెద్దలు ఎక్కువ సమయం మేలుకొని ఉంటే.. ఆ ప్రభావం పిల్లలపై పడుతుందని చెబుతున్నారు.
అలాగే.. పెద్దలు త్వరగా నిద్రపోకపోవడానికి ఎక్కువ శాతం ప్రస్తుతం మొబైల్స్, ల్యాప్టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కారణం అవుతున్నాయి. అంతేకాదు.. మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్, షోలు, సోషల్ మీడియాను అతిగా వాడుతూ.. నిద్రవస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఎక్కువ మంది మేల్కొని ఉంటారని చెప్పారు.