మీ ఇంట్లో పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూస్తున్నారా?
పిల్లల చదువుకు సంబంధించిన విషయ జ్ఞానం కోసం కొందరు తమ పిల్లలకు ఫోన్లు ఇస్తుంటే, మరి కొందరు పిల్లలకి అన్నం తినిపించడానికి, అల్లరి చేయకుండా ఉండటానికి, వారిని సంతోషపరచడం కోసం ఇలా రకరకాల కారణాల వలన ఫోన్లు పిల్లకు ఇస్తున్నారు, అలా స్మార్ట్ ఫోన్ల వాడకం పిల్లలకు ఆనందమైన అలవాటుగా మారిపోతుంది. కానీ ఈ అలవాటు కారణంగా రానురాను వారికి ఎన్ని సమస్యలు ఎదురవుతాయో తెలుసా ?
స్మార్ట్ ఫోన్ లను వాడటం వలన పిల్లలు వాటికి అడిక్ట్ అయిపోయే ప్రమాదం వుంది. దాని వలన చెడు వ్యసనాలకు చేరువయ్యే అవకాశము లేకపోలేదు.
* స్మార్ట్ ఫోన్స్ అధికంగా వినియోగించడం వలన పిల్లల మానసిక సామర్ద్యం తగ్గుతోంది. వారి మానసిక వికాసం దెబ్బతింటుంది. ముందు ముందు వారికి మానసిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
* అంతే కాకుండా ఇలా ఫోన్ లను చూస్తూ ఉండడం మూలంగా వారికి తెలియకుండానే వారి జ్ఞాపకశక్తి పై ప్రభావం పడి జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.
* నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
* తలనొప్పితో తరచూ బాధపడాల్సి వస్తుంది. అలాగే వెన్ను నొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.
* ఒక పని పైన మనసును కేంద్రీకరించడంలో విఫలం అవుతారు, రాను రాను బద్ధకం కూడా పెరుగుతుంది