ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన,
నలుపు నలుపు గాని తెలుపు కాదు,
కొయ్య బొమ్మ దెచ్చి కొట్టిన బలుకునా,
విశ్వదాభిరామ వినురవేమ
భావం
ఎలుక తోలు నల్లగా ఉంటుంది.అది దాని సహజ గుణం. ఎంత ఉతికినా దాని లక్షణం పోదు. కర్ర బొమ్మ తెచ్చి మాట్లాడించాలని ఎంత ప్రయత్నించినా, కుదరరు. కొట్టినా అది పలుకదు. దుష్టులు సైతం అంతే. వారి సహజగుణాన్ని వీడలేరు.
మరింత సమాచారం తెలుసుకోండి: