లైఫ్ స్టైల్: వేపాకుతో ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు ఉండవా..?
1). వేపాకు తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పరుస్తుంది.
2). తరచూ వేపాకు తింటూ ఉండడం వల్ల అలసట అనేది దూరమవుతుంది.
3). వేపాకు బాగా నూరి ఏదైనా గాయాలు అయినప్పుడు అక్కడ పట్టిస్తే ఆ గాయాలు మటుమాయం అవుతాయి.
4). వికారం, వాంతులు వంటివి వచ్చేటప్పుడు వేపాకును కాస్త తినడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు.
5). వేపాకు దగ్గు, ఎక్కువ దాహం వేసే వారికి వీటిని తింటూ ఉండటం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
6).వేప పొడిని గోరువెచ్చని నీటిలో లేదా కలుపుకొని పేస్టులా చేసుకుని ముఖం మీద పట్టించినట్లు అయితే మొటిమలు నల్లమచ్చలు అనేవి దూరమవుతాయి. అంతేకాకుండా వేప ఆకులతో స్నానం చేస్తే చర్మ సమస్యలు కూడా ఉండవు.
7).ఇక వేపనీటిని కషాయంగా చేసుకొని తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు.
8). ప్రతిరోజు కొన్ని వేప ఆకులను రెండు వారాలపాటు తిన్నట్లు అయితే మన శరీరంలో రక్తం బాగా శుద్ధి అవుతుంది. మన పూర్వీకుల సైతం ఎక్కువగా పళ్ళను తిక్కడానికి వేప పుల్లలని ఉపయోగించేవారు. దీంతో పళ్ళు చాలా బలంగా తయారవుతాయి. షుగర్ పేషెంట్లు సైతం వీటిని తినడం వల్ల షుగర్ తగ్గుముఖం పడుతుంది.