ఎన్నో రకాల ఔషద గుణాలతో ఉండే గుమ్మడి కాయలోని గుమ్మడి గింజలు వల్ల మనకు చేకూరే ప్రయోజనాలు తెలుసు కుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. గుమ్మడి మరియ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరియు ఇందులో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడిలో విటమిన్ ఎ, సి, ఇ, కె లు మరియు యాంటీయాక్సిడెంట్స్, ఇంకా జింక్ మరియు పుష్కలమైనటువంటి మెగ్నీషియం ఉండి మొత్తం శరీర ఆరోగ్యనాకి మేలు చేస్తుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఆర్థరైటీస్, గుండె సంబంధిత వ్యాధులు, మరియు క్యాన్సర్ వంటి జబ్బులతో బాధపడే వారికి ఈ గుమ్మడి గింజలు దివ్య ఔషదంగా పనిచేస్తాయి.
ఈ గుమ్మడి గింజలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. గింజలను ఒలిచి లోపల ఉన్న పప్పును తినవచ్చు. లేదా దంచి లోపల ఉన్న పప్పును పొడి చేసి, పాలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదంటే, రోజంతా అప్పుడప్పుడు గుమ్మడి గింజలను కొరుకుతుండటం కూడా అరోగ్యకరమే. ఈ గిoజలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ గింజల్లో యాంటీ స్ట్రెస్ న్యూరోకీమా లక్షణాలు పుష్కలంగా ఉండటం చేత ఇవి, అలసట, ఒత్తిడి మరియు ఇతర సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
ఈ గుమ్మడి గింజలు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూచుకుంటే మంచిది. ఈ గింజలు తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను కూడ నివారిస్తుంది. మధుమేహం డయాబెటీస్ రాకుండా ఉండేందుకు ఈ గుమ్మడి గింజలు ఎంతగానో సహకరిస్తాయి.
ఈ గుమ్మడి గింజలు తినడం వలన రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహం కిడ్నీఆరోగ్యానికి కిడ్నీ సమస్యలతో బాధపడే వారు, వారంలో కనీసం రెండు మూడు సార్లు గుమ్మడి గింజలను తీసుకోవడం చాలా ఉత్తమం. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను సహజంగానే కరిగించడానికి సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ గుమ్మడి గింజల ఫుడ్ ను సూపర్ ఫుడ్స్ లిస్ట్ లో గుమ్మడి గింజలను టాప్ లో ఉంచవచ్చు..