శృంగారం, ప్రణయం, వివాహం.. వీటి గురించి కలలు కనని వాళ్లు చాలా అరుదు. వీటిలో మొదటి రెండు కోరికలు తీరాలంటే మూడోది అవసరం. అందుకు సరైన జీవిత భాగస్వామి లభించాలి. అందుకే పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. మరి హైదరాబాద్ లో ప్రస్తుతం శృంగార జీవనం ఎలా ఉంది.. ఈ సిటీ సెక్స్ లైఫ్ ను ఎలా ఎంజాయ్ చేస్తోంది..
ఈ అంశాలపై ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన సర్వే ఫలితాలు చాలా ఆసక్తికరంగా, కాస్త ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. వీటన్నంటినీ జీర్ణించుకోలేని వాస్తవం ఏంటంటే.. హైదరాబాదీల్లో వందకు 67 శాతం మంది క్యాజువల్ సెక్స్ ను ఎంజాయ్ చేస్తారట. అంటే ముక్కూ మొహం తెలియనివాళ్లతో సెక్స్ సంబంధాలు పెట్టుకుంటారట.
హైదరాబాద్ లో విచ్చలవిడి సెక్స్.. పెరుగుతోందా..
దేశవ్యాప్తంగా ఇలాంటి వాళ్ల సగటు కేవలం 15 ఉంటే.. హైదరాబాదీలు మాత్రం నూటికి 67 శాతం మంది ఇలాంటి క్యాజువల్ సెక్స్ ను ఎంజాయ్ చేస్తారట. అంటే ఇక్కడ గోడ దూకడాలు, అక్రమ సంబంధాలు ఎక్కువే అని చెప్పాలి. అంతే కాదు.. క్యాజువల్ సెక్స్ కోరుకునే వారి సంఖ్య పెరిగిందంటే.. వ్యభిచారం కూడా పెరిగినట్టునగానే భావించాల్సి ఉంటుంది.
మరో ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటంటే.. హైదరబాదీలు సెక్స్ చేస్తూ..దాన్ని వీడియో తీసుకునే అలవాటు ఉన్నవారు నూటికి 37 శాతం మంది వరకూ ఉన్నారట. గతంలో ఇలాంటి అభిరుచి చాలా తక్కువ మందిలో కనిపించేది. కానీ ఇటీవల స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని.. తమ కామక్రీడలను చిత్రీకరించుకుని.. తామే ఆనందించే వారి సంఖ్య పెరుగుతోందన్నమాట.