ఉప్పును దొంగిలిస్తే మీ ఖేల్-ఖతం
చదువది
ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
పదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు ఇన్
పొదవెడు ఉప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
ఎంత చదువు చదివినా రసజ్ఞత, సునిశిత పరిజ్ఞానం లేకుంటే ఆ చదువు వ్యర్ధంవిద్యావంతులు, పండితులు, జ్ఞానులూ ఎవరూ ఆ విద్యను మెచ్చరు. ఎంతో గొప్పగా, రకరకాల దినుసులతో, మసాలాలతో, ఘుమఘుమ లాడే వంటలు నలుడు, భీముడు అంతటి గొప్ప వంట వాళ్ళు చేసినా, తగింత ఉప్పు ఆ వంతలకు తగిలించకపోతే రుచి ఏర్పడదు కదా! వంట ఎంత గొప్పవళ్ళు వండినా రుచిరాదు కదా! అని భాస్కర శతక రచయిత చెప్పాడు. చిటికెడు ఉప్పు కడివెడు పాత్రలోని వంటను రుచిలేకుండా చెస్తుంది. అదీ ఉప్పు మహిమ.
కారం, పులుపు, తియ్యదనం లెని వంటలను తయారు చేయవచ్చు తినవచ్చు. కాని ఉప్పులేని వంటలు చప్పగా ఉండి తినలేము. గతకాలములో ఉప్పు తయారీ చాలా కష్టంగా ఉండేది. ఉప్పును జాగ్రత్తగా డాచేవారు. ఎందుకంటే ఉప్పుకోసం దొంగతనాలు జరిగేవి. ఉప్పు పై పన్ను విధించి ధరలు పెంచి నందుకు మహాత్మా గాంధి బ్రిటీషు వారిపై తిరగబడి గుజరాత్ లోని దండి గ్రామం వరకు దండి మార్చ్ నిర్వహించి అక్కడే ఉప్పు సత్యాగ్రహం చేయించి వాళ్ళకు మంచి ధీటైన దెబ్బ కొట్టాడు కూడా.
ఉప్పును కాళ్ళతో తొక్క రాదు. ఉప్పును దొంగిలించ రాదు. ఉప్పును చేబదులు ఇవ్వరాదు. ఉప్పును చేతితో ఇంకొకరికి దించరాదు. ఉప్పును అప్పుగా తీసుకోరాదు. ఉప్పు మూటలపై కూర్చోరాదు. ఇలాంటి రూలింగులు ఇప్పటికి ప్రచారములో ఉన్నాయి.
వీటిని ని ప్రచారం చెయటములో ఉప్పు గతములో దొరకక పోవటమే. "లక్షాధికారైన లవణ మన్నమే గాని, మెరుగు బంగారంబు మింగబోడు" అనే సామెత కూడా కఠిక పేదవాడైనా, లక్షాధికారైనా ఉప్పు లేక బ్రతక లేడు అని చెప్పటమే.
ఉప్పును వృధా చేయకుండా, జాగ్రత్త పరచటానికి ఉప్ప్పుని శనీశ్వరుని, యమధర్మరాజు సంకేతాలుగా పండిత, పామర జనాన్ని భయపెట్టే వారు. ఇప్పటికీ శని గ్రహ పీడ తొలగటానికి ఉప్పు దాన మిచ్చే ఆచారం కొనసాగుతూనే ఉంది.