రావ‌ణుడు చ‌నిపోయే ముందు రాముడికి చెప్పిన మాట..!

లంకాధిపతి రావణబ్రహ్మ యుద్ద భూమిలో..మృత్యు శయ్యపై అవసాన దశలో శ్రీరాముడితో ఇలా అన్నాడు.. 
“రామా !! నీ కంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. నేను బ్రాహ్మణ జాతి  పుట్టాను నీది క్షత్రియ జాతి. నేను నీ కంటే వయసులో పెద్ద. నా కుటుంబం… మీ కుటుంబం కన్నా పెద్ద. నా వైభవం.. నీ వైభవం కన్నా అధికం.



మీ అంత:పురమే స్వర్ణం.. నా లంకానగరమే స్వర్ణమయం  నేను బలపరాక్రమాలలో … నీకంటే శ్రేష్ఠుడిని. నా రాజ్యము, నీ రాజ్యము కంటే పెద్దది. జ్ఞానంలో, తపస్సులో
నీ కంటే శ్రేష్ఠుడిని”. “ఇన్ని శ్రేష్ఠమైన విషయాలు కలిగి వున్నా .. యుద్ధంలో నేను నీ ముందు ఓడిపోయాను.



దీనికి కారణం ఒకటే… నీ తమ్ముడు నీ దగ్గర వున్నాడు.. నా తమ్ముడు నన్ను వదలి వెళ్ళిపోయాడు”. నీతి కుటుంబం పరివారమై వెంట ఉంటే ఎంతటి కష్టమైన యుద్దమైనా విజయం సాదిస్తుంది పరివారమే కుటుంబమయితే ఆనందం మన వెంటే ఉంటుంది.  కుటుంబం దూరమైతే  బతుకే భారమవుతుంది.



రావణబ్రహ్మ లాంటి వాడే ఓటమి పాలయ్యాడంటే.. మనలాంటి వాళ్ళ బ్రతుకెంత? ఎందుకంటే… ఏ వృక్షమూ…. కఱ్ఱ సహాయం లేని గొడ్డలితో తెగి పడదు.
వృక్ష జాతి స్నేహం తోనే… గొడ్డలి విజయం సాధిస్తుంది. అందుకే అందరం కలిసి ఉందాం….! విజయాలు సాదిద్దాం !! కుటుంబాలు విచ్చిన్నం కాకుండా అందరం ప్రయత్నిద్దాం!!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: