లైంగిక పటుత్వం కోసం..పురుషులు ఇవి వాడితే బెటర్
ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్ లో సంపాదన కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు మగవారు. తమ కుటుంబ సభ్యులు హాయిగా ఉండాలి..పది మందిలో తాము గౌరవంగా జీవనం సాగించాలని కొద్ది పాటి ఒత్తిడికి లోనైనా సంపాదనకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంతవరకు ఒకే కానీ.. అలసి పోయి ఇంటికి వచ్చిన భర్త సంసార సుఖానికి మాత్రం దూరమవుతున్నారని పరిశోదనల్లో తెలిసిందే. దీనికి కారణం పొల్యూషన్, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి ఇతర కారణాలు అని చెప్పొచ్చు.
అయితే ఒకప్పుడు ఎంత శ్రమించినా సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పురుషులు శృంగార విషయంలో సమర్థులుగా ఉండేవారు..అందుకే అనాటి కాలంలో ఒక్కో ఇంట్లో పది మంది పిల్లలు ఉండేవారు. కానీ ఇప్పుడు అంతా తారుమారైంది..చాలా మంది పురుషులు శృంగార విషయంలో కాస్త విముఖత చూపిస్తున్నారు..దానికి కారణం వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల కారణంగా పడకగదిలో సరిగ్గా తమ శక్తిని చూపించలేకపోతున్నారు.
దీనికి తోడు పలు అనారోగ్య సమస్యలు కూడా అందరినీ కామన్‌గా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అలాంటి వాటిలో లైంగిక సామర్థ్యం కూడా ఒకటి. అయితే కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను దంపతులు నిత్యం తమ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో వారి శృంగార శక్తి రెట్టింపు అవుతుంది. మళ్లీ ఎప్పటిలా ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఆ ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1 . వెల్లుల్లి : వెల్లుల్లిని నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే దాంతో లైంగిక శక్తి పెరుగుతుంది. పురుషుల్లో అయితే వీర్యం ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. కణాలు నాణ్యంగా కూడా ఉంటాయి. ఆలిసిన్ అనే పదార్థం వెల్లుల్లిలో ఉండడమే ఇందుకు కారణం.
2. అల్లం:నిత్యం తగుమోతాదులో అల్లాన్ని ఆహారంలో భాగంగా తింటూ ఉన్నా శృంగార శక్తిని పెంచుకోవచ్చు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చూస్తాయి.
3.ఉసిరికాయ: నిత్యం ఉసిరికాయను ఏదో ఒక విధంగా తినడం అలవాటు చేసుకుంటే పురుషుల్లో వీర్య నాణ్యత పెరుగుతుంది. లైంగిక పటుత్వం కూడా వస్తుంది.
4. ఆస్పారగస్ : ఆస్పారగస్లో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంటిక పటుత్వాన్ని పెంచుతుంది.
5. ఆల్చిప్పలు: స్త్రీ, పురుషులిద్దరిలో ఉండే సెక్సు హార్మోన్లను ప్రేరేపించడంలో ఆల్చిప్పలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తింటుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
6. అశ్వగంధ టీ : అశ్వగంధ పొడి (మార్కెట్లో దొరుకుతుంది) తో తయారు చేసిన టీని తాగుతుంటే లైంటిక శక్తి బాగా పెరుగుతుంది. దీంతో పాటు పురుషుల్లో ఉండే అంగ స్తంభన సమస్య పోతుంది.
7. అవకాడోలు: వీటిలో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శృంగార పటిమను పెంచుతాయి. అంతేకాదు పురుషుల్లో అంగ స్తంభన సమస్యను తొలగిస్తాయి.
8. చాకొలేట్ : చాకొలేట్లో కోకో ఎక్కువగా ఉంటుంది. ఇది ఆ శక్తిని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.