ప్రకృతి సోయగం చిత్రకూట్ జలపాతం

Suma Kallamadi
చిత్రకూట్ జలపాతం భారత దేశం యొక్క నయాగర జలపాతంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాక భాతదేశంలో విశాలమైన జలపాతం అనే ఒక ప్రత్యేకతను ఉంది. ఈ జలపాతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం, బస్తర్ జిల్లా, జగదల్పూర్ నుంచి 38 కి.మీ.., ఆ రాష్ట్ర రాజధాని రాయపూర్ నుంచి 276 కి.మీ..దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి రాయపూర్, విశాఖపట్నం నుంచి జగదల్పూర్ చేరుకోవడానికి విమాన, రైలు మరియు బస్సు సౌకర్యాలు అన్ని కూడా ఉన్నాయి. జగదల్పూర్ నుంచి టాక్సీల ద్యారా రోడ్డు మార్గం ద్వారా చిత్రకూట్ జలపాతానికి చేరుకోవచ్చు. 


ఈ జలపాతం ఇంద్రావతి నదిపై ఒడిస్సా రాష్ట్రంలో పుట్టి, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని పశ్చిమ బస్తర్ జిల్లాలో ఉన్న చిత్రకూట్ గుండా సహజ జలపాతంగా కనివిందు చేసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించి చివరిగా గోదావరి నదిలో కలవడం జరుగుతుంది. ఈ నదిపై చాలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ జలపాతం సహజ సిద్దమైనది. ఇది 95 ఫీట్స్ నుంచి జాలువారుతూ, 985 ఫీట్ల వెడల్పుతో ప్రపంచ సోయగా జలపాతం అయిన నయాగరలో ఇది మూడో వంతును తలపిస్తుంది. ఈ జలపాతం ప్రకృతి వడిలో తన సోయగాలను విరజిమ్ముతుంది. ఈ జలపాతాన్ని చూడడానికి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా వర్షా కాలంలో జులై - సెప్టెంబర్ , శీతా కాలంలో నవంబర్ - జనవరి మాసాలలో చల్లగా , ఆహ్లాదకరంగా ఉండడం వలన పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. 


ఈ జలపాతం ఒడ్డున పెద్ద శివలింగం , మహానందితో కూడిన ఆలయంను దర్శించవచ్చు. ఇక్కడ జలపాతం దిగువన భాగంలో నీటిలో విహరించుటకు పడవ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్రదేశానికి కొద్దిపాటి దూరంలోనే కాంగర్ లోయ (ఘాటీ ) నేషనల్ పార్క్ మరియు తీరథ్ గఢ్ జలపాతం ఉన్నది. చిత్రకూట్ జలపాతం ఛత్తీస్గఢ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన పొందిన జలపాతాలతో ఒకటిగా ఉంది. భారతదేశ నయాగరాగా పిలువబడే ఈ జలపాతాన్ని మీ జీవితంలో ఒక్కసారైనా సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: