రాగి చెంబులో నీరు తాగడం వలన ఉపయోగాలు
ప్రస్తుత కాలంలో అంతా ప్లాస్టిక్ మయం… ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మన ముందు తరాల్లో.. ఎక్కడ ఏ ఇంట్లో చూసినా రాగి పాత్రలే కనిపించేవి. ఎందుకంటే రాగి పాత్రలుంటే రోగాలు రావు అనేవారు. రాత్రి నిద్ర పోయేముందు రాగి చెంబు నిండా మంచినీరు పోసి నిలువ ఉంచుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే వెంటనే రాగి చెంబులో ఉన్న నీరు పరగడుపున తాగడం చాలా మంచిది. అరగంట లోపు సుఖవిరేచనం అగుతుంది.
మరి ఇలా నీరు తాగడం వలన ఉపయోగాల గురించి తెలుసుకుందామా మరి.. అరగంట లోపు సుఖవిరేచనం అగుతుంది. గ్యాస్ నిర్మూలించ బడుతుంది. కడుపు ఉబ్బరం, కడుపు మంట నివారించ సులువుగా బడుతుంది. మలబద్దకం, తేపులు మొదలయిన బాదలన్ని ఈ అలవాటుతో పూర్తిగా నిర్మూలించబడును.
మలబద్దకం సమస్త వ్యాధులకు మూల కారణం. ఈ పధ్ధతి ద్వారా మలబద్దకం నివారించుకుంటే వందేళ్ళ వరకు వ్యాధులు దరిచేరవు. రాగి చెంబులో నిలువ ఉంచిన నీటిలో ఖర్జూరం ఎండుది ఒక 5 వేసి నానబెట్టి పొద్దున్నే విత్తనాలు తీసివేసి పిసికి తిని ఆ నీటిని తాగితే కిడ్నీలు శుభ్రపడి బలంగా తయారు అవుతాయి. కిడ్ని రోగులకు చాలా ఉపయుక్తం.
రాగిలో యాంటి బ్యాక్టీరియల్ నేచర్ లభిస్తుంది. రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఎటువంటి పరిస్థితిలోనూ ఉండదు. కాబట్టి ఇందులో నిల్వచేసే పదార్ధాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక రాగి పాత్రలలో నీళ్ళు ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు. అందుకే పాత రోజుల్లో రాగి బిందెలు ఉపయోగించేవారు.
గతంలో నీళ్ళు వేడి చేసుకోవడానికి రాగితో చేసిన బాయిలర్లు వాడే వాళ్ళు. ఇందులో వేడి చేసిన నీరు వాడడం వల్ల చర్మ సంబంధిత రోగాలు కూడా తగ్గేవని రుజువు కూడా అయ్యాయి. రాగి చెంబులో రాత్రి నీరు వుంచి పగలు నిద్ర లేవగానే తాగితే చాలా చాలా మంచిది. అలా తాగితే కడు పులో వున్న చెడు అంతా మూత్రం ద్వారా బయటకి వచ్చేస్తుందట. ఈ అలవాటు వల్ల గ్యాస్, కిడ్నీ, లివర్ సమస్యల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చు.