ఇలా చేస్తే దోమలు, ఈగలు, బొద్దింకలు పరార్...!

Reddy P Rajasekhar

ఈగలు, దోమలు చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తాయి. కానీ ఈగలు, దోమల వలన ఏర్పడే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు వర్షాకాలంలో మాత్రమే తీవ్రంగా ఉండే దోమలు ఇప్పుడు అన్ని సీజన్లలోను తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈగలు గుయ్యుగుయ్యిమంటూ మోత మోగిస్తూ చిరాకు తెప్పిస్తాయి. దోమలు, ఈగలను వెళ్లగొట్టటానికి ఉపయోగించే లిక్విడ్స్, జెట్ కాయిల్స్ వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. 
 
దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీల దగ్గర, ఇంటి ప్రాంగణంలో బంతిపూల మొక్కలను పెంచాలి. బంతిపూల మొక్కల నుండి వచ్చే వాసనకు దోమలు రావు. తలుపులు, కిటికీలు మూసి కొద్దిసేపు కర్పూరం వెలిగిస్తే ఆ వాసనకు దోమలు ఇంట్లోకి ప్రవేశించవు. కర్పూరం వెలిగిస్తే దోమలతో పాటు ఈగలు కూడా పోతాయి. {{RelevantDataTitle}}