భారత్ లో భారీగా తగ్గిన పోర్న్ వీక్షకులు ...

Suma Kallamadi

భారతదేశంలో పోర్న్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అయినప్పటికీ వివిధ మార్గాల్లో మన వాళ్లు పోర్న్ చూస్తున్నారనుకోండి, అది వేరే విషయం. కానీ మన దేశంలో పోర్న్ పై ఉన్న నిషేధం అమెరికన్ కంపెనీ అయిన యాపిల్ ని ఒక విషయంలో మాత్రం నంబర్ వన్ చేసిందంటే నమ్ముతారా? ఏ విషయంలో అనుకుంటున్నారా? అదేనండి ప్రపంచంలోనే ప్రముఖ పోర్న్ సైట్ అయిన "పోర్న్ హబ్" తమ వినియోగదారులు ఏ ఆపరేటింగ్ సిస్టం ఉన్న మొబైల్స్ ను ఉపయోగిస్తున్నారో తెలిపింది. ఆ జాబితాలో ఎప్పుడూ నంబర్ వన్ స్థానంలో ఉండే ఆండ్రాయిడ్ ఇప్పుడు రెండో స్థానానికి దిగజారింది.

 

దానికి, దీనికి ఏం సంబంధం అనుకుంటున్నారా మీరు. ప్రపంచంలోనే జనాభా విషయంలో రెండో స్థానంలో ఉన్న మన దేశంలో ఎక్కువ మంది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నే ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనదేశం నుంచి ఆండ్రాయిడ్ మొబైల్ లో పోర్న్ చూసే వారి సంఖ్య కూడా కోట్లలోనే ఉంటాది. కాబట్టి మన దేశంలో పోర్న్ పై విధించిన నిషేధం వారందరిపై బాగానే ప్రభావం చూపించింది. దీనితో ఈ విషయంలో యాపిల్ నంబర్ వన్ కు చేరింది.

 

పోర్న్ హబ్ విడుదల చేసిన లెక్కల ప్రకారం 2019 లో ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టం నుంచి 52.8 శాతం ట్రాఫిక్ వారి వెబ్ సైట్ కు లభించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా పోర్న్ చూసే వారి సంఖ్య 46.6 కు చేరింది. ఇంకా 0.5 శాతం మంది వినియోగదారులు వేరే ఆపరేటింగ్ సిస్టం నుంచి పోర్న్ చూస్తున్నారు. 2018 తో పోలిస్తే ఆండ్రాయిడ్ నుంచి చూసే వారి సంఖ్య 14 శాతం తగ్గిపోగా, ఐవోఎస్ నుంచి చూసే వారి సంఖ్య 19 శాతం పెరిగింది.

 

2018 లో పోర్న్ హబ్ చూసే దేశాల్లో మన దేశం మూడో స్థానంలో ఉండేది. అయితే ఇప్పుడు బ్యాన్ కారణంగా 2019 లో 15వ స్థానానికి చేరుకుంది. ఈ విషయాన్ని కూడా పోర్న్ హబ్ తన నివేదికలో వివరించింది. ఈ సైట్ ట్రాఫిక్ లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా జపాన్, ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉన్నాయి. పోర్న్ చూసేవారి సంఖ్య తగ్గినప్పటికీ ఆ వెబ్ సైట్ పై గడిపే సగటు సమయం పెరిగిందని పోర్న్ హబ్ తన నివేదికలో పేరుకొంది. అంతే కాకుండా పోర్న్ చూసేవారి సగటు వయసు కూడా 30 సంవత్సరాలుగా ఉందని చెప్పారు.

 

ఇక బ్రౌజర్ల విషయానికి విషయానికి వస్తే గూగుల్ క్రోమ్ 44.6 శాతం ట్రాఫిక్ తో నంబర్ వన్ గా నిలవగా, యాపిల్ సఫారీ బ్రౌజర్ 41.6 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో యూసీ బ్రౌజర్, ఒపెరా బ్రౌజర్లు క్యూలో నిలిచియాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: