సీన్ రివర్స్: గద్దను గడగడలాడించిన ఆక్టోపస్.. విపరీతంగా వైరల్ అవుతోన్న వీడియో

Kavya Nekkanti

గద్దలు సాధారణంగా తమ ఆహార అన్వేషణలో కూసింత వెరైటీ టెక్నీక్‌ను అవలంబిస్తుంటాయి. ఆకాశంలో విహరిస్తూనే నేలపై, నీటిలోని చిన్న చిన్న జీవులపై ఫోకస్ పెడుతుంటాయి. అనంతరం అదను చూసి ఒక్కసారిగా కిందకు వచ్చి వాటిని నోట కరచుకొని వెళ్లిపోతుంటాయి. కానీ.. ఓ గ‌ద్ద‌ను మాత్రం ఆక్టోప‌స్ గ‌డ‌గ‌డ‌లాడించేసింది. నీటిలో ఉన్న ఆక్టోపస్‌ కోసం కిందకు వచ్చిన గద్దకు వింత అనుభవం ఎదురైంది. వివ‌రాల్లోకి వెళ్తే.. కెనెడాలోని వాంకోవర్‌ ఐలాండ్‌లో ఆహారం కోసం నీటిలో అన్వేషిస్తోన్న ఓ గద్దను  ఆక్టోపస్‌ వచ్చి గద్దను తన కబంద హస్తాలలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేసింది. 

 

దానికి చిక్కిన గద్ద విలవిల్లాడిపోయింది.. విడిపించుకోలేపోయింది. సరిగ్గా అదే సమయానికి చేపలను పెంచే సాల్మన్‌ బృందం పడవలో వెళ్తూ గద్ద అరుపులు విని అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆక్టోపస్‌ హస్తాలలో చిక్కుకున్న గద్ద బయటికి వచ్చేందుకు చేస్తున్న పోరాటాన్ని ఆ బృందం గమనించింది.  బాధతో అది చేస్తోన్న చప్పుడును విన్న ఓ వ్యక్తి ఆక్టోపస్‌ {{RelevantDataTitle}}