అమ్మాయి అందాన్ని బట్టి రేటు..! ఎక్కడంటే.. !

NAGARJUNA NAKKA

నిన్నటిదాకా మెట్రోనగరాలకే పరిమితమైన హైటెక్ వ్యభిచారం.. ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తోంది. కాలేజీ అమ్మాయిలకు మాయమాటలుచెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. వెబ్‌సైట్లు క్రియేట్ చేసుకుని.. వ్యాపార ప్రముఖులు, పెద్దింటి పిల్లల్ని ఆకర్షిస్తూ.. జేబులు నింపుకుంటున్నారు. చిత్తూరు కేంద్రంగా సాగుతున్న హైటెక్‌ వ్యభిచార ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు.


ఆన్‌లైనే అస్త్రం.. సోషల్‌ వెబ్‌సైట్లే ఆయుధం.. వాట్సప్‌లో అందమైన అమ్మాయిల నగ్నచిత్రాలను పెట్టి బడాబాబుల పిల్లలను టార్గెట్ చేస్తున్నాయి వ్యభిచార ముఠాలు. ఫోన్‌ కాల్స్‌లోనే వ్యవహారం చక్కబెట్టి .. గుట్టుగా గలీజు దందా చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో తాజాగా వ్యభిచార ముఠాను పోలీసులు సినీపక్కీలో దాడిచేసి పట్టుకున్నారు. మగ పోలీసులను విటులుగా పంపి, మఫ్టీలో లేడీకానిస్టేబుల్స్‌ను పెట్టి, ఈ ముఠాను అరెస్ట్ చేశారు. నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. యువతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు.


 
మురకంబట్టు కేంద్రంగా చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు కాలేజీ అమ్మాయిలను.. డబ్బులు, ఇతర విలాసాలు ఎరచూపుతూ ఈ మురికి కూపంలోకి దించిందీ ముఠా. చూసేందుకు కాలేజీ అమ్మాయిలు కావడంతో.. ఏదో చదువుకోవడానికి వచ్చారని... స్థానికులు భావించారు. ఒక్కో అమ్మాయి స్కిన్ టోన్‌, బాడీ షేప్‌,ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని.. వారికి 5 వేల నుంచి 30 వేల రూపాయల వరకూ ధర నిర్ణయించింది. అంతేనా ఈ దందాలో ఉన్నత కుటుంబాలకు చెందిన వారి పిల్లలు కూడా ఉండంతో వీరికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీరిని పొరుగురాష్ట్రాలకు సైతం పంపిస్తూ కాసులు దండుకుంటోంది.

 

పేరున్న కుటుంబాలకు చెందిన మహిళలు సైతం ఈ రంగంలోకి దిగడంతో... విటులను చూసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విటుడిగా తెలిసినవ్యక్తి వస్తే పరువు పోతుందనే భయంతో.. తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తొలుత వాట్సాప్‌లో విటుడి చిత్రాన్ని పంపించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ముందుకుపోతున్నారు. పైగా సెల్‌ఫోన్‌లో మాట్లాడే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతా తెలుసుకున్నాకే సదరు మహిళ ఫొటో విటుడికి పంపించి బేరమాడుకుంటున్నట్లు సమాచారం. ఇక వీరికి ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి,ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపిస్తూ మొబైల్ ఫోన్ ద్వారా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. 


 
ఇలాంటివే మరికొన్ని ముఠాలుసైతం చిత్తూరు పరిసర ప్రాంతాల్లో వ్యభిచారం సాగిస్తున్నాయి. కుటుంబం, వ్యాపారం, కన్సల్టెన్సీ తదితర పేర్లతో అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత నివాస గృహాలను అద్దెకు తీసుకుంటూ.. విటుల్ని, అమ్మాయిల్ని అక్కడికే పిలిపించి మరి వ్యాపారాన్ని సాగిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: