భార్య బాత్రూం లోకి వెళ్లి వచ్చేలోపు రూ.30 కోట్లను సంపాదించిన భర్త!

Yelleswar Rao

భార్య బాత్రూం లోకి వెళ్లి వచ్చేలోపే లక్ష్మీ దేవి భర్త ఇంటి తలుపులు టపటపా కొట్టింది. తలపులు తీసాడు.. ఏముంది? కోట్ల రూపాయలను అతని జేబులో కుమ్మరించింది. దీంతో అదృష్టం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరని వరిస్తుందో ఎవరూ ఊహించలేరనేది నిజమనిపిస్తుంది. నిజానికి, ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు అయిన అదృష్టవంతులు కోకోల్లలు. అది ఎలా అంటే... సింపుల్ 'లాటరి' ద్వారా. మన భారతీయులు కూడా ఆన్లైన్ లాటరి సైట్ లలో కొంత డబ్బును కట్టి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇప్పటికే అలా ప్రయత్నించి కోట్లను గెలుచుకున్న వారు ఎక్కువమందే ఉన్నారు. శ్రమలేకుండా లక్షలను/కోట్లను గెలుచుకుంటే ఆ సంతోషమే వేరు. ఈరోజు మనం ఆ స్థాయిలో సంతోషపడే అదృష్టవంతులు గురించే తెలుసుకోపోతున్నాం.


పై ఫొటోలో ఉన్న లండన్ వ్యక్తి పేరు టామీ, పక్కన ఉన్నది అతని భార్య. పేరు షెల్లీ. వీళ్లిద్దరు వారి 15 సంవత్సరాల వయసులోనే ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకొని.. 8 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వారి వయసులు 12, 10, 9, 7, 5, 3, 1, 8నెలలు. ఒకరోజు రాత్రి టామీ, షెల్లీ వారి 8 మంది పిల్లలకు తినిపించి, పడుకోబెట్టారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి లాటరి సైట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రయతిస్తున్నారు. కొన్ని వెబ్ సైట్లు లో ట్రై చేసారు కానీ విఫలం అయ్యారు.



ఆ తర్వాత bet365 సైట్ లో రకరకాల గేమ్స్ ఆడటం ప్రారంభించారు. ఒక అరగంట వరకు అలానే ట్రై చేసారు కానీ ఏం డబ్బులు రాలేదు. 'సరే, ఏం చేస్తాం. బాత్రూంకు వెళ్లొస్తా' అంటూ షెల్లీ వెళ్ళింది. ఆ సందర్భంలోనే టామీ ఒక యూరో పెట్టి 'ది పిగ్ విజార్డ్ ఫ్రూట్ మెషిన్' అనే ఒక చక్రం తిప్పే గేమ్ ఆడాడు. చక్రం పైనున్న బాణం తిరిగి, తిరిగి చివరికి £3.79 మిలియన్ పై ఆగింది. అంతే అతడు ఒక్కసారిగా స్టన్ అయ్యాడు.

భార్య బాత్రూం నుంచి రాగానే తాను లాటరి లో £3.79 మిలియన్లను(రూ.30కోట్లు) గెలిచుకున్నానని చెబుతూ ఆమెను ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత వారి పిల్లలకు, బంధువులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ వచ్చిన డబ్బుతో 3 గదులున్న వారి లండన్ లోని ఇంటి నుంచి 50 మైళ్ల దూరంలో ఉన్న 'కెంట్' నగరంలోని 6 గదుల ఇంటికి మకాం మార్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. అలాగే ఒక కారు కొంటున్నామని, తమ పిల్లలను డిస్నీ ల్యాండ్ కి తీసుకెళ్ళబోతున్నామని మీడియా కు చెప్పారు. తమకు ఇంతలా అదృష్టం కలిసొస్తుందని అస్సలు ఊహించలేదంటూ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: