లైసెన్సు లేని ఎయిర్ గన్ తో కుక్క ను కాల్చిచంపిన బ్యాంకు ఉద్యోగి

Manasa Karnati

 

ఒక రోజు ఒక వ్యక్తి ఒక కుక్క తమను రోజు వేధిస్తోందని,రోజూ మొరుగుతూ ఇబ్బంది పెడుతుందన్న కారణంతో బర్రెల షెడ్డుకు  కాపలాగా ఉంటున్న కుక్కను ఓ వ్యక్తి ఎయిర్‌గన్‌తో కాల్చి చంపారు. ఈ సంఘటన సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో ఉండే బాపూ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకోవడం జరిగినది. కుక్కకు ఎడమ భుజంలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో కుక్క అక్కడికక్కడే చనిపోవడం జరిగినది వివరాల్లోకి వెళ్ళితే..

 

 రాజు, దేవేందర్, సుదర్శన్‌ అనే ముగ్గురు అన్నదమ్ములు కలసి ఓల్డ్‌ సరూర్‌నగర్‌ చౌడీ వద్ద ఒక బర్రెల షెడ్డును నిర్వహిస్తున్నారు. ఈ బర్రెలు అన్నిటికీ ఒక కుక్కను కాపలాగా పెట్టారు. అది ఎవరైనా కొత్తవారు వస్తే అరుస్తూనే ఉంటుంది. ఈ షెడ్డులో జాకీ అనే కుక్క కాపలాగా ఉంటోంది.

 

   ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆ బర్రెల షెడ్డు నుంచి బయటకు వచ్చిన కుక్క. అక్కడే ఉంటున్న బాపూ కాలనీలోని జిమ్‌ కోచ్, బ్యాంక్‌ ఉద్యోగి అవినాశ్‌ కరణ్‌ ఇంటికి వెళ్లింది. దాంతో అతనికి విపరీతమైన కోపం వచ్చింది. దీంతో అతడు తన వద్ద ఉన్న ఎయిర్‌ గన్‌తో కుక్క ను కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయింది. దీంతో కుక్క యజమానులు సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

దీనిపై ఐపీసీ 429, 336 సెక్షన్లతో పాటు ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయాల్టీ యాక్ట్‌ సెక్షన్‌–11 కింద కేసును పోలీసులు నమోదు చేసారు. నిందితుడు ఎయిర్‌గన్‌ కలిగి ఉండటంతో ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడు విచక్షణ రహితంగా కుక్కను కాల్చి చంపడం చాలా బాధాకరం. తుపాకీ లైసెన్స్ లేకుండా ఇంట్లో ఉంచుకోవడం తప్పు అని ఆ బ్యాంకు ఉద్యోగి తెలియదేమో.ఏమైనా కానీ కేసు నమోదు అయితే ఆ బ్యాంకు ఉద్యోగి ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: