ఆహారం & వంటకాలుః విభిన్న రుచుల న్యూ ఇయర్ ప్రత్యేక వంటలు
కావలసిన పదార్ధములుః మైదా - 2 కప్పులు
పంచదార - 1 1/2 కప్పు
జీడిపప్పు - 24
బాదం పప్పు - 24
కిస్మిస్ - 24
వెన్న - 3 కప్పులు
బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు
హార్లిక్స్ పౌడర్ - 1 కప్పు
వెనిల్లా ఎసెన్స్ - 6 చుక్కలు
పాలు - 1 కప్పు
ఎండుకొబ్బరి - 2 చెంచాలు
గుడ్లు - 2
యాలకులు - 12
చెర్రీలు - 24
ఫ్రూటీ క్రూటీ - 24 తయారు చేసే విధానంః బేకింగ్ పౌడర్, మై దాపిండి, పంచదారను గిలక్కొట్టిన ఎగ్ మిశ్రమంలో కలుపుకోవాలి. వెన్నలో సగం వేసి బాగా కలపాలి. చిన్న పాత్రలో వెన్న రాసి, అందులో పై మిశ్రమాన్ని పోసి జీడిపప్పు,యాలకుల పొడి, కొబ్బరి కోరు, కిస్మిస్ కలిపి కుక్కర్లో పెట్టుకోవాలి. ఇది బాగా ఉడికి కమ్మటి వాసన వస్తుండగా దింపి ట్రేలో పెట్టాలి. మిగిలిన వెన్నలో అరకప్పు పంచదార వేసి బాగా కలిపి దాన్ని పైన చేసుకున్న కేక్ పైభాగంపై సర్దాలి. దీనిపై చెర్రీలు, ఫ్రూటీ క్రూటీ ముక్కలను అలంకరించాలి.
................................................................................................. పన్నీర్ డ్రైఫ్రూట్ పాయసం కావలసిన పదార్థాలు:
పాలు.. లీటరు
పనీర్.. ఒక కప్పు
కొబ్బరితురుము.. అర కప్పు
పంచదార.. ఒక కప్పు
యాలకుల పొడి.. అర స్పూన్
శాఫ్రాన్.. కొద్దిగా
నెయ్యి.. తగినంత
ఎండు ద్రాక్షలు.. కొద్దిగా జీడిపప్పు, బాదం, పిస్తా.. సరిపడా. తయారు చేసే విధానం: ముందుగ స్టౌవ్ వెలిగించి పాత్రలో పాలను పోసి మరిగించాలి. ఇందులో పనీర్ తురుము, కొబ్బరితురుము వేసి ఉడికించాలి. పంచదార కూడా వేసి కలిపి స్టౌవ్ సిమ్లో ఉంచి మిశ్రమం చిక్కగా అయ్యేవరకు ఉడికించి యాలకులపొడి వేయాలి. ఇంకో పాత్రలో ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి ఎండు ద్రాక్షలు, జీడిపప్పు, బాదం, పిస్తా వేయించాలి. వీటిని మరిగించిన పాలలో కలపాలి. ఖీర్ బాగా చిక్కగా కావాలంటే కొంచెం కోవా వేసుకోవచ్చు. అంతే పసందైన పన్నీర్ డ్రైఫ్రూట్ పాయసం రెడీ. వేడిగా తాగాలనుకుంటే అలాగే తాగొచ్చు లేదంటే ఫ్రిజ్లో ఉంచి చల్లగా తాగితే ఇంకా బాగుంటుంది.